Thiruveer:హ్యాపీ బర్త్ డే టు వెర్సటైల్ యాక్టర్ తిరువీర్.. ‘మిషన్ తషాఫి’లో తిరువీర్ క్యారెక్టర్‌ను అనౌన్స్ చేసిన జీ 5
Send us your feedback to audioarticles@vaarta.com
తిరువీర్.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటూ విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాలతో పాటు ఓటీటీ మాధ్యమంలోనూ తిరువీర్ రాణిస్తున్నారు. ఇప్పుడు టాప్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన జీ5 ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’లో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించి జీ 5 అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎంగేజింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రణతి రెడ్డి నిర్మాత.
ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్రకారం శరవేగంగా పూర్తవుతుంది. ఇప్పుడు వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ ఈ టీమ్‌లో జాయిన్ కావటంపై మేకర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తిరువీర్ బర్త్ డే సందర్బంగా ‘మిషన్ తషాఫి’లో ఆయన నటిస్తున్నారంటూ జీ 5 అధికారికంగా ప్రకటించింది. తిరువీర్ విలక్షణ నటనతో తన పాత్రను డైరెక్టర్ ఊహించిన దాని కంటే ఇంకా బెటర్ ఔట్ పుట్ ఇస్తారని మేకర్స్ భావిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు వంటి డైరెక్టర్‌తో కలిసి పని చేయటంపై తిరువీర్ సైతం ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ఇండియా లో భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకి, ఇండియన్ RAW ఏజెంట్స్ కి మధ్య నడిచే బావోద్వేగమైన హై ఇన్టెన్స్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇది.
8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను ఫిల్మ్ రిపబ్లిక్ బ్యానర్‌పై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు ఓటీటీలో ఎవరూ నిర్మించని రీతిలో జీ 5 దీన్ని భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిస్తోంది. అంతే కాకుండా ఇప్పటి వరకు ఓ తెలుగు వెబ్ సిరీస్‌ను ఫారిన్ లొకేషన్స్‌లో చిత్రీకరించలేదు. కానీ తొలిసారి ‘మిషన్ తషాఫి’ సిరీస్‌ను విదేశాల్లో కూడా చిత్రీకరిస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ నేతృత్వంలో ఫైట్స్‌ను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.
జీ5 గురించి:
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి ఇలా ఇతర భాషల్లో ఉన్న గొప్ప కంటెంట్‌ను జీ5 నిత్యం ఆడియెన్స్‌కు అందిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా జీ5కి మంచి కంటెంట్ అందిస్తుందనే పేరు ఉందన్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన లూసర్ 2, బీబీసీ స్టూడియో, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంగ్, అహనా పెళ్లంట, ఏటీఎం, పులి మేక, వ్యవస్థ వంటి ఎన్నో మంచి వెబ్ సిరీస్‌లను జీ5 అందించింది. అలాగే రీసెంట్గా విడుదలైన మనోజ్ బాజ్‌పాయి నటించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రం కూడా సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది.
నటీనటులు:
తిరువీర్, సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీష్ కురువిల్లా, ఛత్రపతి శేఖర్, భూషణ్ కళ్యాణ్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఫిల్మ్ రిపబ్లిక్, నిర్మాత: ప్రణతి రెడ్డి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు, సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై, ఆర్ట్: సాయి సురేష్, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, పి.ఆర్.ఓ: ఫణి - నాయుడు (బియాండ్ మీడియా), డిజిటల్: టికెట్ ఫ్యాక్టరీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout