హ్యపీ బర్త్ డే టు కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు....

  • IndiaGlitz, [Saturday,March 19 2016]

సినిమాలో కథానాయకుడు నెంబర్ వన్ అనుకుని ప్రేక్షకులు సినిమాలు చూడాలనుకునే రోజుల్లో ప్రతి నాయకుడుగా తనదైన ముద్రవేసి, ప్రతి నాయకుడంటే అలా ఉండాలి అనుకునేలా తనదైన ముద్ర వేసిన నటుడు కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు...తనదైన డైలాగ్ మాడ్యులేషన్ డెలివరీ ఉన్న నటుడు, విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్న సమ్మోహన నటుడు, కలెక్షన్స్ తో రికార్డులను సృష్టించి కలెక్షన్ కింగ్ గా అవతరించిన హీరోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. విలక్షణ విలనీజాన్ని పండించాలన్నా, అన్యాయాన్ని తుదముట్టించే హీరో క్యారెక్టర్ చేయాలన్నా, రసిక రాజశేఖరుడి పాత్రనైనా, భక్తి పారవశ్యంలో మునిగితేలే తిరుమలరాయుడుగా మెప్పించాలన్నా, దేవుణ్ణి ద్వేషించే రాయలసీమ రామన్న చౌదరిగా రౌద్రకారుడిగా తెరపై కనిపించాలన్నా ఆయనకే చెల్లు.

ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఆయన నైజం. క్రమశిక్షణకు మారుపేరు. మాటలను తూటాల్ల ఉపయోగించి అటు నాయకుడి పాత్రనైనా, ప్రతినాయకుడి పాత్రనైనా పండిచడం ఆయనకే సొంతం. మంచు ఆయన ఇంటి పేరు. మాట కరుకు.. మనసు వెన్న. అందుకే ఆయనంటే అందరికీ ఇష్టం. స్వర్గం-నరకం సినిమాతో నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన తనదైన విలక్షణ నటనతో ఇప్పటి వరకు దాదాపు 650 చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించి మెప్పించారు. నాయకుడు, ప్రతినాయక పాత్రలే కాకుండా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి 50పైగా చిత్రాలను నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు. ఎందరికో ఆసారాగా నిలిచి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు.

సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. మోహన్ బాబు నుండి అలవర్చుకున్న క్రమశిక్షణతో ఆయన కుమారులైన మంచు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ ప్రసన్నలు కూడా సినీ రంగంలో తమదైన శైళిలో దూసుకుపోతున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, హీరో, నిర్మాతకు సరైన అర్థం చెప్పిన కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు పుట్టిన రోజు ఈరోజు(మార్చి 19). ఇటువంటి పుట్టిన రోజులను అయన ఎన్నో జరుపుకోవాలని ఇండియాగ్లిజ్డ్ కోరుకుంటుంది..

***హ్యపీ బర్త్ డే టు కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు****

More News

దటీజ్ పవర్ స్టార్ ప్లానింగ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు.

సోగ్గాడు గురించి చిరు, వెంకీ, మహేష్ కామెంట్స్...

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే.

సుప్రీమ్ ఆడియో రిలీజ్ డేట్..

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్.

'ఊపిరి' సెన్సార్ పూర్తి...

నాగార్జున,కార్తీ,తమన్నా కీలక పాత్రల్లో నటించిన ‘ఊపిరి’మార్చి 25న విడుదల కానుంది.

నాకో ఇంకో పేరుంది అంటున్న సమంతా...

సమంత ఇంకో పేరు ఏమిటని తెగ ఆలోచిస్తున్నారా..?