హ్యపీ బర్త్ డే టు కమల్ హాసన్
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా అంటే మన ఉహాకు అందని పాత్రలు, మన చుట్టూ ఉన్న జీవితాలు ఇలాంటి వాటిని ప్రస్పుటం చేస్తుంటుంది. ఇలాంటి సినిమాకు తమ నటనతో ప్రాణం పోసేవాళ్ళే నటీనటులు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కునే నటీనటులు కొంతమందైతే, ఇమేజ్ కు అతీతంగా ఏ పాత్రలో అయినా ఒదిగిపోగల నటులు బహుకొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో మనకు గుర్తుకు వచ్చే నటుడు కమల్ హాసన్...కురుచవాడిగా చేయాలని, సత్యభామగా కనిపించాలన్నా, అన్యాయంపై భారతీయుడుగా తిరగబడాలన్నా ఇలా ఒకటేమిటి ఆయన చేయలేని పాత్ర లేదు. అందుకే ఆయనకు అభినయం పట్టం కట్టింది.
ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన కీర్తికిరీటంలో చేరాయి. ఆయన నటించిన చిత్రాల్లో అనేక ప్రయోగాలు చేసేవారు..ఇప్పటికీ చేస్తున్నారు. ఆరు పదులు వయసైనా ఇంకా తానెదో నేర్చుకోవాలనే ఆయన తపన మనకు కనపడుతుంటుంది. తనకు నచ్చిన పాత్రలను ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలని అహర్నిశలు కష్టపడుతుంటారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో నటుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడుగా తనదైన ముద్ర వేశారు కమల్. అభిమానుల గుండెల్లో చెక్కుచెదరని స్థానాన్ని ఆక్రమించుకున్న కమల్ హాసన్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఇండియా గ్లిజ్డ్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తుంది.
....................హ్యపీ బర్త్ డే టు కమల్ హాసన్...............
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com