హ్యాపీ బర్త్ డే టు నందమూరి బాలకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
నేటి తరం హీరోల్లో నటనలో వాడి, డైలాగ్స్ లో పవర్‌తో ప్రేక్షకుడిని థియేటర్‌వైపు అడుగులు వేయిస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ. నందమూరి తారక రామారావు సినీ వారసుడిగా తెలుగు సినిమా రంగానికి పరిచయమైన నటసింహం నందమూరి బాలకృష్ణ అనతి కాలంలో అగ్రహీరోగా ఎదిగారు.
తండ్రికి తగ్గ తనయుడు
తండ్రికి తగ్గ తనయుడిగా నాలుగు దశాబ్దాలకు పైగా నటించి నందమూరి నటవారసుల్లో తన ప్రత్యేకతను చాటుకున్న హీరో బాలకృష్ణ. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ములుపులు, మైలురాళ్లు. సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ సాధించిన విజయాలకు కొదవేలేదు. తెలుగునాట అగ్ర కథానాయకుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 14 సంవత్సరాలకే తండ్రి నందమూరి తారకరామారావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మ కల సినిమాతో తెరంగేట్రం చేశారు. తనలోని నటనాసక్తిని కనబరిచి మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. సినిమా కెరీర్ పారంభంలోనే అన్నదమ్ముల అనుబంధం, అనురాగదేవత, రౌడీ రాముడు`కొంటెకృష్ణుడు వంటి సాంఘిక చిత్రాలు, దానవీర శూరకర్ణ పౌరాణిక, వేముల వాడ భీమకవి, అక్బర్ సలీం అనార్కలి చారిత్రక సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా తన అసమాన ప్రతిభను చాటుకున్నారు. 1984లో సాహసమే నా జీవితం సినిమాతో బాలకృష్ణ కథానాయకుడిగా మారారు. మంగమ్మగారి మనవడుతో సూపర్‌హిట్ కొట్టి క్రేజ్ పెంచుకున్నారు.
ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య, నారి నారి నడుమ మురారి, అనసూయమ్మగారి అల్లుడు, మువ్వగోపాలుడు వంటి సినిమాలు భారీ విజయాలు సాధించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాలకృష్ణను దగ్గర చేశాయి. తండ్రి ఎన్టీఆర్ నుండి పుణికి పుచ్చుకున్న నటనా కౌశలంతో కృష్ణార్జున విజయంలో కృష్ణుడు, అర్జునుడు, శ్రీరామరాజ్యంలో శ్రీరాముడి, పాండురంగడులో పాండురంగడు పాత్రకు పౌరాణిక పాత్రకు ప్రాణం పోశారు. ఇప్పటి తరం హీరోల్లో పౌరాణిక, జానపదం, సోషియో ఫాంటసీ, చారిత్రక, భక్తిరస, సాంఘిక చిత్రాలు... ఇలా అన్ని రకాల సినిమాల్లో నటించిన ఏకైక హీరో బాలకృష్ణే. నటుడిగా మూసదోరణి సినిమాలు చేయడానికి బాలకృష్ణ ఇష్టపడరు. అది ఆయన సినిమాలు చూసే ప్రేక్షకుడికి అర్థమవుతుంది.
ఫ్యాక్షన్ సినిమాకు సరికొత్త నాంది....
తెలుగు చిత్రసీమలో ఫ్యాక్షన్ చిత్రాల్లో నటించి భారీ విజయాలు అందుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణే. ఆ దిశగా ముందు అడుగు వేసింది కూడా ఆయనే. సమరసింహారెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టి తెలుగునాట ఫ్యాక్షన్ సినిమా ట్రెండ్‌కి నాంది పలికిన నటసింహ నరసింహనాయుడు సినిమాతో మరోసారి భారీ హిట్ కొట్టి బాక్పాఫీస్ బొనాంజాగా నిలిచారు. లక్ష్మీనరసింహాతో పోలీస్ పవర్‌ను చూపి కలెక్షన్స్ క్లొగొట్టిన బాలయ్య సింహా సినిమాతో బాక్సాఫీస్ వద్ద సింహనాదం చేసి తన డైలాగ్స్ లో వాడి, వేడి ఏ మాత్రం తగ్గలేదని సినీవిమర్శకులకు చెప్పకనే చెప్పారు.
లెజెండ్‌తో సెన్సేషన్...రాజకీయాల్లో తిరుగులేని విజయం
2014 నందమూరి బాలకృష్ణకి ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల విడుదలైన లెజెండ్‌తో మరో లెజెండ్రీ హిట్ కొట్టడమే కాకుండా 2014 ప్రత్యక్ష్య రాజకీయాల్లో పాల్గొని హిందూపురం నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఇటు సినిమాలు, అటు రాజకీయాలను సమన్వయం చేసుకుంటూ రాణిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సత్యదేవ దర్శకత్వంలో బాలకృష్ణ రెండు షేడ్స్ లో నటించిన లయన్ చిత్రంతో మరో విజయాన్ని కైవసం చేసుకున్న నటసింహం శ్రీవాస్ దర్శకత్వంలో డిక్టేటర్ చిత్రంలో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కథ, డైరెక్టర్స్ కి ప్రాధాన్యతనిచ్చే బాలకృష్ణ ప్రస్తుతం ప్రెస్టిజియస్ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి` చిత్రంలో నటిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రయోగాలకు వెనకాడని తత్వం, పట్టుదలతో ముందుకు సాగే సాహసం ఈ నందమూరి అందగాణ్ణి నటసింహం చేశాయి.
మొరాకోలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న గౌతమిపుత్ర శాతకర్ణి`
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం మొరాకోలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో మొరాకోలో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ అధ్వర్యంలో హాలీవుడ్ ఫైటర్స్ సహకారంతో ఈ యాక్షన్ పార్ట్ ను అద్భుతమైన లోకేషన్స్ లో చిత్రీకరించారు. రెండు వారాల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో నందమూరి బాలకృష్ణ రోజుకు 14 గంటలపాటు పనిచేశారు. ఆయన ఎనర్జీ చూసి యూనిట్ అంతా ఇంకా ఎనర్జిటిక్‌గా పనిచేశారు. బాలకృష్ణగారి సపోర్ట్ తో తొలి షెడ్యూల్‌ను అద్భుతమైన లోకేషన్స్ లో అనుకున్న సమయానికి పూర్తి చేశామని నిర్మాతలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ చిలుకూరులో వేసిన భారీ యుద్ధనౌక సెట్లో రెండో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో రాణి వశిష్టదేవిగా శ్రేయాశరన్ నటిస్తుంది.
యు.ఎస్‌లో ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు...
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది జూన్ 10న పుట్టినరోజును యు.ఎస్‌లో సన్నిహితులు, అభిమానుల మధ్య ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments