హ్యపీ బర్త్ డే టు అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
అనుష్కశెట్టి, టాలీవుడ్, కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ తెలుగులో రుద్రమదేవి`, బాహుబలి` వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా రేంజ్ మరింత పెరిగింది. త్వరలో సైజ్ జీరో అనే డిఫరెంట్ మూవీలో డిఫరెంట్ గెటప్ తో సందడి చేయబోనుంది. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అలాగే తమిళంలో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ హీరోస్ అజిత్, విజయ్ ల సరసన నటించింది.
2005లో సూపర్` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు మంచి నటనతో దశాబ్దకాలం పాటు హీరోయిన్ గా హవా కొనసాగిస్తూనే ఉంది. అరుంధతి` సినిమాలో జేజేమ్మ పాత్రలో నటించిన తర్వాత అనుష్క ఇమేజ్ మారిపోయింది. ఆ సినిమా తర్వాత ఏ దర్శక, నిర్మాతకైనా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటే ముందు గుర్తుకు వచ్చేది అనుష్క అని చెప్పాలనే విధంగా స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం అనుష్క చేస్తున్న సినిమాలు విడుదలైతే అనుష్క రేంజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. వయసు పెరిగిన గ్లామర్ తగ్గని ఈ యోగా బ్యూటీ మరిన్ని సక్సెస్ లు సాధించాలని కోరుకుంటూ ఇండియా గ్లిజ్డ్ ఆమెకి బర్త్ డే విషెష్ చెబుతుంది
***హ్యపీ బర్త్ డే టు అనుష్క****
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com