SS Rajamouli:తెలుగు సినిమా మగధీరుడు.. భారతీయ సినిమా బాహుబలి.. ఎస్ఎస్ రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన 'మగధీరుడు'. తెలుగు సినిమాకు అందని ద్రాక్ష లాగా ఉన్న ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసిన 'విక్రమార్కుడు'. భారతీయ బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసిన 'బాహుబలి'. అతనే ఎస్ఎస్ రాజమౌళి. ఈ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. శాంతినివాసం సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్‌తో 'స్టూడెంట్ నెం.1' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'సింహాద్రి', 'సై', 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'యమదొంగ' సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకుని ఔరా అనిపించారు.
తెలుగు సినిమా రికార్డులు చెరిపేసిన 'మగధీర'..
అంతవరకు బాగానే ఉన్నా అప్పుడే రాజమౌళి అసలు సిసలైన ప్రతిభ బయటకు వచ్చింది. మెగా వారసుడు రామ్‌చరణ్ హీరోగా ఆయన తీసిన 'మగధీర' సినిమా తెలుగు సినిమా రికార్డులను చెరిపేసింది. ఆ సినిమాలో జక్కన్న తీసిన యుద్ధ సన్నివేశాలు, ఎడారిలో హార్స్ రైడింగ్ సీన్లు అభిమానులను కట్టిపడేసింది. ఆ సినిమాతో చరణ్‌కు తిరుగులేని స్టార్‌డమ్ తీసుకువచ్చారు. అంతటి ఘన విజయం సాధించిన రాజమౌళి.. తర్వాతి చిత్రం 'మర్యాదరామన్న'లో కమెడియన్ సునీల్‌ను హీరోగా పెట్టి తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సినిమాతోనూ సూపర్ హిట్ అందుకుని శభాష్ అనిపించారు.
హిందీ ప్రేక్షకులకు తెలుగోడు సత్తా చూపించిన 'బాహుబలి'..
ఇక అప్పుడే మొదలైంది భారతీయ సినిమాపై రాజమౌళి దండయాత్ర. ఈగను హీరోగా పెట్టి రాజమౌళి తీసిన 'ఈగ' చిత్రం హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో ఈగ చేత చేయించిన ఫైట్స్, గ్రాఫిక్స్ సీన్లు అందరినీ అబ్బూరపరిచాయి. అప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ అంటే తమిళం మాత్రమే అనుకునే హిందీ ప్రేక్షకులకు తెలుగు ఇండస్ట్రీ కూడా ఉందని 'బాహుబలి' సినిమా ద్వారా రాజమౌళి చాటి చెప్పారు. భారతీయ సినిమా రికార్డులను చెరిపేసిన 'బాహుబలి' చిత్రంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న యావత్ దేశాన్ని షేక్ చేసింది. 'బాహుబలి2' కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసేలా చేసేందంటే రాజమౌళి టేకింగ్ స్టైల్ అలా ఉంది.
భారతీయ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన 'బాహుబలి2'..
ఇక 2017లో విడుదలైన 'బాహుబలి2' చిత్రం అయితే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికీ భారతీయ సినిమా రికార్డులన్ని బాహుబలి2 చిత్రంపైనే ఉన్నాయంటే ఆ చిత్రం ఎంత ప్రభంజనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. మొదటిసారి ఓ భారతీయ సినిమా రూ.1000కోట్లు వసూలు చేసింది. అది కూడా తెలుగు సినిమా కావడం రాజమౌళి ప్రతిభకు అద్ధం పడుతోంది. హిందీ హీరోలు, దర్శకులు ఆ రికార్డును బ్రేక్ చేయడానికి ఇప్పటికీ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ఆస్కార్ అవార్డు అందుకున్న తెలుగు సినిమా..
ఇంతటితో అయిపోలేదు ఇప్పుడే మొదలైంది అన్నంటూ అభిమానుల్లో ఉప్పునిప్పులుగా ఉండే నందమూరి, మెగా కుటుంబాల నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను హీరోలుగా పెట్టి 'ఆర్ఆర్ఆర్' చిత్రం తీసి ప్రపంచ రికార్డులను సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. 'నాటు నాటు' పాట అయితే ఓ ఊపు ఊపేసింది. ఇక తెలుగు సినిమాకు అందని ద్రాక్ష లాగా ఉన్న ఆస్కార్ అవార్డును తీసుకువచ్చారు. 'నాటు నాటు' పాటకు ఉత్తమ గీతంగా ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అది రాజమౌళి ప్రతిభే అని చెప్పుకోవాలి.
హాలీవుడ్ కుంభస్థలాన్ని కొట్టేందుకు రెడీ అవుతున్న జక్కన్న..
ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేశారు రాజమౌళి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ అడ్వాంటేజర్ మూవీ తీయనున్నారు. దీంతో ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. హాలీవుడ్ కుంభస్థలాన్ని బద్ధలుకొట్టడానికి సిద్ధమవుతున్న ఎస్ఎస్ రాజమౌళికి ఇండియాగ్లిట్జ్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout