హ్యాపీ బర్త్ డే ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
రెబల్ స్టార్ క్రిష్ణంరాజు వారసుడుగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై..రాఘవేంద్ర,వర్షం సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మాస్ ప్రేక్షకులను తొలి చిత్రంతోనే ఆకట్టుకుని శభాష్ అనిపించుకున్నాడు. తన పర్సనాలిటీకి తగ్గ క్యారెక్టర్ తో మాస్, క్లాస్ ఆడియోన్స్ ని వర్షం సినిమాతో ఆకట్టుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన చిత్రం ఛత్రపతి. ఈ సినిమాతో ప్రభాస్ సంచలన విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఈ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు ప్రభాస్.
పెదనాన్న క్రిష్ణంరాజు మాస్ హీరో అయినప్పటికీ క్రిష్ణవేణి, మధురస్వప్నం, అమరదీపం తదితర క్లాస్ మూవీస్ లో నటించి మెప్పించారు. ప్రభాస్ కూడా మాస్ హీరో అయినప్పటికీ మిస్టర్ పరఫెక్ట్, డార్లింగ్...ఇలా క్లాస్ మూవీస్ లో కూడా నటించి మెప్పించారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన తాజా చిత్రం బాహుబలి. ఈ సినిమా వెండితెర అద్భుత చిత్రంగా నిలిచి టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమాగా అంతర్జాతీయ స్ధాయిలో సంచలనం స్రుష్టించడం విశేషం.
ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. నవంబర్ నుంచి బాహుబలి 2 షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటాడు. బాహుబలి సినిమాతో జాతీయ స్ధాయిలో పాపులర్ అయిన ప్రభాస్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా బాహుబలి ప్రభాస్ కి బర్త్ డే విషెష్ తెలియచేస్తుంది ఇండియాగిల్ట్జ్.కామ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments