హ్యపీ బర్త్ డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.....
- IndiaGlitz, [Wednesday,September 02 2015]
''నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది''..
''నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా''
ఇవి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ 'గబ్బర్‌సింగ్' సినిమాలోని డైలాగ్స్. కానీ నిజ జీవితంలోనూ పవర్‌స్టార్‌కు పర్‌ఫెక్ట్ గా సెట్ అవుతాయి.
అందరూ వెళ్ళే దారిలో పవన్ ఎప్పుడూ వెళ్ళలేదు. మొదట్నుంచీ నా స్టైలే వేరు అన్నట్టుగానే డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. తనదైన బాణీతో ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్‌ని సెట్ చేయడం పవన్ స్టైల్. పవన్‌లా కనిపించాలి, పవన్‌లా మాట్లాడాలని, పవన్‌లా పవర్ చూపించాలని యూత్ ఉత్సాహపడతారు. అందుకే పవర్‌స్టార్ సినిమా అంటే ఓపెనింగ్స్ అదుర్స్ అనిపిస్తాయి.
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'తో హీరో అయి 'గోకులంలో సీత, సుస్వాగతం' వంటి వైవిధ్యమైన సినిమాలు చేసి 'తొలిప్రేమ'తో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి అన్నకు తగ్గ 'తమ్ముడు'గా ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకున్న పవర్‌స్టార్ 'బద్రి'తో స్టైల్ మార్చాడు. 'ఖుషి'తో రికార్డులు తిరగరాసాడు. 'జానీ'తో మంచి దర్శకుడు అనిపించుకున్నారు. 'గుడుంబా శంకర్'గా ఎంటర్‌టైన్ చేసారు. 'బాలు, బంగారం, అన్నవరం' చిత్రాలతో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించారు. 'జల్సా'తో భారీ హిట్ సాధించారు. 'కొమరం పులి, తీన్‌మార్, పంజా' చిత్రాలతో ఓ అడుగు వెనక్కి వేసినా ఒకేసారి 'గబ్బర్‌సింగ్'తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి దటీజ్ పవర్‌స్టార్ అనిపించుకున్నారు పవన్. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' క్లైమాక్స్ లో ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించే పవర్‌ఫుల్ డైలాగ్స్ తో తన పవర్ చూపించారు. 'అత్తారింటికి దారేది'తో బాక్సాఫీస్‌ని షేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించి పవర్‌స్టార్ తన సత్తాని మరోసారి చూపించారు. విడుదలకు ముందే పైరసీ సీడిలు బయటకు వచ్చినా 'అత్తారింటికి దారేది' ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించడం పవర్‌స్టార్ స్టామినాకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. 'అత్తారింటికి దారేది'లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత చాలామంది దర్శక నిర్మాతలు సినిమాలు చెయ్యడానికి రెడీగా వున్నప్పటికీ పవన్ దృష్టి రాజకీయాల వైపు పడింది. ప్రజలకు తనవంతు బాధ్యతగా ఏదైనా చెయ్యాలన్న సదుద్దేశ్యం నుండి వచ్చిందే 'జనసేన' పార్టీ. 'జనసేన' పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర రాజకీయాల్లో పవర్‌స్టార్ చురుకైన పాత్ర నిర్వహించి తన ప్రభావాన్ని ఎన్నికల ఫలితాలపై పడేలా చేసి మరోసారి దటీజ్ పవర్‌స్టార్ పవర్ అనుకునేలా చేసారు.
ప్రస్తుతం కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో 'సర్ధార్ గబ్బర్‌సింగ్' చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పవర్‌స్టార్ 'జనసేన' అధ్యక్షుడిగా తన పవర్‌ని పూర్తిగా చూపించడానికి రెడీ అవ్వాలని పవర్‌స్టార్ అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకు మంచి చెయ్యడం కోసమే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసినట్లే పాలిటిక్స్ లో కూడా కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి పక్కాగా ప్లాన్స్ సిద్ధం అవుతున్నాయి. కేవలం 20 సినిమాలతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూ హిస్టరీ క్రియేట్ చేసిన పవర్‌స్టార్ పొలిటికల్‌గా కూడా ఎంట్రీతోనే గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేసారు.
రోజురోజుకీ పవర్‌స్టార్‌ని అభిమానించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఫ్యాన్ పవర్ ముందు ముందు ఎన్నో వండర్స్ క్రియేట్ అవడానికి దోహద పడుతుంది. నిర్మొహమాటంగా, నిర్భయంగా తన అభిప్రాయాలను వెల్లడించే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని అందరూ ఇష్టపడతారు. సెప్టెంబర్ 2 పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ బర్త్‌డేని పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకుంటామని, ప్రతిక్షణం ప్రజాహితం కోరుకునే రియల్ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు చెపుతూ ముందు ముందు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మరిన్ని అద్భుత విజయాలు సాధించి మహాశక్తిగా ఎదుగుతారని.. పదిమందికీ సాయపడే మంచి పనులతో ఈ రియల్ లీడర్ ముందడుగు వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..
....హ్యపీ బర్త్ డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.....