హ్యాపీబర్త్ డే టు నాగచైతన్య....
Send us your feedback to audioarticles@vaarta.com
లవ్, యాక్షన్, సెంటిమెంట్, డ్రామా, ఎమోషన్ ఇలా అన్నీ రకాల చిత్రాల్లో నటించి మెప్పించగల నటులు కొంతమందే ఉంటారు. వారిలో నటసామ్రాట్ డా||అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. అక్కినేని వంశం నుండి నట వారసత్వం వచ్చిన మూడో తరం హీరో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. తండ్రి కింగ్ నాగార్జున తనయుడుగా జోష్‌తో సినీ రంగ ప్రవేశం చేసిన నాగచైతన్య తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకోవడానికి డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ యూత్‌లో, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్నారు. జోష్‌తో హీరోగా తెరంగేట్రం చేసిన చైతు తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన లవ్ ఎంటర్‌టైనర్ 'ఏ మాయ చేసావె' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ప్రేమ కథా చిత్రాలంటే అక్కినేని ఫ్యామిలీ హీరోస్ ది బెస్ట్ అనే ప్రేక్షకుడికి, అభిమానులకు అంచనాలను నిజం చేశాడు.
విలక్షణ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన '100%లవ్' చిత్రంలో బాలుగా మిల్కీబ్యూటీ తమన్నాతో కళ్లు కళ్లు ప్లస్ అంటూ ఆడిపాడి మరో సక్సెస్‌ను తన ఖాతో వేసుకున్నాడు. తర్వాత విడుదలైన దడ, బెజవాడ చిత్రాలతో నాగచైతన్య యూత్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. డాలీ దర్శకత్వంలో వచ్చిన తఢాఖా చిత్రంలో అన్నకు అండగా నిలబడే తమ్ముడి పాత్రలో నాగచైతన్య నటను సూపర్బ్. చైతు నటనకు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చైతు అభిమానులుగా మారారు.
అక్కినేనివారి 'మనం'
అక్కినేని ఫ్యామిలీ మూడు తరాలకు చెందిన హీరోలందరూ కలిసి నటించిన చిత్రం 'మనం'. ఇండియాలోనే ఇలా మూడు తరాల నటులు కలిసి నటించిన రెండో చిత్రం కూడా 'మనం' కావడం విశేషం. అంతే కాదు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి చిత్రం కూడా 'మనం'. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చైతు నటననను చూసిన వారు ఎక్సటెంట్. తన టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్ సూపర్బ్ అని అందరూ కితాబిచ్చారు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలతో పాటు అఖిల్ కూడా నటించాడు.
అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే ఆటోనగర్ సూర్య పాత్రలో నాగచైతన్య అందరి ప్రశంసలు అందుకున్నారు. ఒక లైలా కోసం వంటి ప్రేమకథా చిత్రమ్‌తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య, తర్వాత దోచెయ్ అనే యాక్షన్ థ్రిల్లర్‌లో తన నటనకు మంచి మార్కులనే సంపాదించుకున్నారు.
ఈ ఏడాది రెండు వరుస విజయాలు...
ఈ ఏడాది రెండు వరుస విజయాలను సాధించిన హీరోగా నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. మలయాళంలో సెన్సేషనల్ సక్సెస్ అయిన ప్రేమమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ ప్రేమకథా చిత్రాల హీరోగా తన మార్కు హిట్ అందుకున్న చైతు ఏ మాయ చేసావెతో తొలి హిట్ అందించిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సాహసం శ్వాసగా సాగిపోతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం కింగ్ నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో లవ్ ఎంటర్‌టైనర్‌తో పాటు కొత్త దర్శకుడు కృష్ణ దర్శకత్వంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటించనున్నాడు. కొత్తదనమున్న సినిమాలను అందిస్తూ అక్కినేని అభిమానులను, తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు నవంబర్ 23. అక్కినేని నాగచైతన్య తన కెరీర్‌లో మెరెన్నో విజయాలను సాధిస్తూ తాత, తండ్రికి తగ్గ నటవారసుడుగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com