మోహన్ లాల్ హ్యాపీ బర్త్ డే...
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుని..ప్రేక్షకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం ఏర్పరుచుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. మలయాళం, తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన మోహన్ లాల్ ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డ్ కూడా అందుకున్నారు. 1980లో సినీ రంగంలో ప్రవేశించిన మోహన్ లాల్ నాటి నుంచి నేటి వరకు విభిన్నపాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తాజాగా మోహన్ లాల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి జనతా గ్యారేజ్ చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. గాంఢీవం చిత్రంలో బాలయ్యతో కలిసి నటించిన మోహన్ లాల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి నటిస్తుండడం విశేషం.
జనతా గ్యారేజ్ చిత్రంతో పాటు మోహన్ లాల్ మనమంతా అనే చిత్రంలో నటిస్తున్నారు. మనమంతా అనే టైటిల్ కి వన్ వర్డ్ ఫోర్ స్టోరీస్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. నాలుగు కథలతో రూపొందే ఈ చిత్రకథలో మలుపులు - ముగింపు చాలా ఆసక్తిగా ఉంటాయట.ముఖ్యంగా మోహన్ లాల్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంటున్నారు.
ఈరోజు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పుట్టినరోజు. ఈ సదర్భంగా జనతా గ్యారేజ్ టీమ్, మనమంతా టీమ్ మోహన్ లాల్ కి బర్త్ డే విషెష్ తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేసారు. చాలా గ్యాప్ తరువాత తెలుగులో నటిస్తూ..త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న మోహన్ లాల్ హ్యాపీ బర్త్ డే & ఆల్ ది బెస్ట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments