హ్యపీ బర్త్ డే టు మెగాస్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
కష్టపడితే మనిషి మహోన్నత స్థానానికి ఎదుతాడనే దానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. 1979లో ప్రాణం ఖరీదు చిత్రంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన చిరు తన సినీ కెరీర్ లో అనేక ఎత్తు పల్లాలను, సవాళ్లను ఎదుర్కొని ఈరోజు మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. తన మెగా హిట్స్ తో తెలుగు సినిమా స్టామినా పెంచిన మెగాస్టార్ బాక్సాఫీస్ కింగ్ గా వెలిగారు. ఆయన ఏం చేసినా హ్యుజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి.
ప్రాణం ఖరీదు చిత్రం తర్వాత మనవూరి పాండవులు, తాయరమ్మ బంగారయ్య, ఇది కథ కాదు, శ్రీరామ బంటు, కోతల రాయుడు, పున్నమినాగు, మొగుడు కావాలి, న్యాయం కావాలి, చట్టానికి కళ్ళులేవు, కిరాయి రౌడీలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, పల్లెటూరి మొనగాడు, అభిలాష, గూఢచారి నెం.1, మగమహారాజు వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఖైదీ చిత్రం సాధించిన సక్సెస్ చిరుని స్టార్ గా మార్చేసింది. సుప్రీమ్ హీరో అయ్యారు.
తర్వాత మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్, ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం, దొంగ, పసివాడి ప్రాణం వంటి కమర్షియల్ చిత్రాల విజయాలతో ఆయన రేంజ్ పెరుగుతూ వచ్చింది. కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా స్వయం కృషి, రుద్రవీణ వంటి చిత్రాలతో అవార్డులను సైతం అందుకున్నారు.
యముడికి మొగుడు, ఖైదీ నెం.786 వంటి కమర్షియల్ విజయాలను మళ్లీ అందుకున్నారు. మరణ మృదంగం సినిమాతో మెగాస్టార్ గా అయ్యారు. త్రినేత్రుడు, కొండవీటి దొంగ, స్టేట్ రౌడీ, జగదేకవీరుడు-అతిలోకసుందరి చిత్రాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నారు. గ్యాప్ తీసుకుని సెలక్టెడ్ మూవీ చేయాలనుకున్న చిరంజీవి తర్వాత వచ్చిన హిట్లర్, బావగారూ బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం, అన్నయ్య, మంజునాథ, వంటి వరుస విజయాలను సాధించారు.
ఇంద్ర, ఠాగూర్ చిత్రాలతో సరికొత్త రికార్డులను సాధించారు. అలాగే శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్., శంకర్ దాదా జిందాబాద్ లతో ఈ విజయాలను కంటిన్యూ చేశారు. రాంచరణ్ మగధీరలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన చిరంజీవి మరోసారి రాంచరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్ మూవీలో మెరవనున్నారు. ఇప్పటి వరకు 149 చిత్రాల్లో నటించి మెప్పించిన చిరు 150 వ సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
ఈ చిత్రంతో ఓ అరుదైన రికార్డ్ చేస్తున్న వన్ ఆఫ్ ది సౌతిండియన్ హీరోగా నిలిచారు. తన ప్యామిలీ నుండి వచ్చిన పవన్ కళ్యాన్, రాంచరణ్, అల్లుఅర్జున్, అల్లుశిరీష్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లకు బ్యాక్ బోన్ లా నిలిచారు. సినిమాలకే పరిమితం కాకుండా నేత్రదానం, రక్తదానం వంటి సేవాకార్యక్రమాల్లో కూడా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఈ రోజు(ఆగస్ట్ 22న) తన 60వ పుట్టినరోజు జరుపుకుంటోన్న చిరంజీవికి ఇండియా గ్లిజ్డ్ తరపును హ్యపీ బర్త్ డే శుభాకాంక్షలు.
హ్యపీ బర్త్ డే టు మెగాస్టార్ చిరంజీవి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout