హ్యపీ బర్త్ డే టు సూపర్ స్టార్ మహేష్..

  • IndiaGlitz, [Sunday,August 09 2015]

అమ్మాయి కలల రాజకుమారుడుగా, యూత్‌ ఐకాన్‌ గా విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్‌టైన్‌ చేసే ఎంటర్‌ప్రెన్యూరర్‌, బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్స్‌ సునామీని క్రియేట్‌ చేసే మ్యాజికల్‌ మేన్‌..వన్‌ అండ్‌ ఓన్లీ సూపర్‌స్టార్‌ మహేష్‌...

తనతో సినిమాలు చేసే దర్శకులకు, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ కి కలెక్షన్స్‌ క్పతరువు, తెలుగు సినిమా మార్కెట్‌ స్థాయిని పెంచి తెలుగు పేక్షకుడికి గుండెల్లో చెరిగిపోని అభిమాన ధనాన్ని సంపాదించుకున్న శ్రీమంతుడు' సూపర్‌స్టార్‌ మహేష్‌...

తండ్రి నుండి సంక్రమించిన నటవారసత్వాన్ని మరో స్థాయికి తీసుకెళుతూ సూపర్‌స్టార్‌ ఇమేజ్‌కి ఇమేజ్‌లా ఉంటూ తండ్రి అందించిన బాధ్యతను మోస్తూ, ప్రేక్షకు ఆశల ప్లలకికి బోయిగా ఉంటూనే వారిని ఎంటర్‌టైన్‌ చేయడం మాటలు కాదు.. కానీ ప్రతి బాధ్యతను నవ్వుతూ మోయడం సూపర్‌స్టార్‌ మహేష్‌కే చెల్లింది....

బాలనటుడిగా సినిమాల్లోకి నీడ సినిమాతో రంగ ప్రవేశం చేసి పోరాటం, శంఖారావం, ముగ్గురు కొడుకు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్నతమ్ముడు వంటి చిత్రాల్లో తనదైన నటనతో మురిపించి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించారు.

రాజకుమారుడు చిత్రంతో తొలిసారి హీరోగా తొగు తెరకు పరిచయమైన తొలి చిత్రంతో తిరుగులేని సక్సెస్‌ను సాధించిన ప్రిన్స్‌ మహేష్‌బాబు తొలి చిత్రంతోనే నూతన ఉత్తమ నటుడుగా స్పెషల్‌ జ్యూరీ నంది అవార్డ్‌' అందుకున్నారు. మనిషికి కావాల్సింది సంకల్పబలం అది ఉంటే ఏదైనా సాధించవచ్చునని మురారి చిత్రంతో ప్రూవ్‌ చేసే క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. ఈ చిత్రానికిగానూ ఉత్తమనటుడిగా స్పెషల్‌ జ్యూరీ అవార్డుని సొంతం చేసుకున్నారు.

లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఒక్కడు చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడమే కాకుండా ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్‌ అవార్డుని తన ఖాతాలో వేసుకున్నారు.

అతడు చిత్రంతో మరో సక్సెస్‌ కొట్టిన మహేష్‌ పోకిరితో బాక్సాఫీస్‌ రికార్డును తిరగరాశారు. ఆ సినిమాతో తెలుగు సినిమా వైపు మొత్తం ఇండియన్‌ సినిమానే తిరిగి చూసేలా కొత్త రికార్డులను సృష్టించారు. ఇదే హవాను దూకుడుతో మరోసారి ప్రూవ్‌ చేశారు. తనదైన కామెడి టైమింగ్‌తో నవ్విస్తూనే విలన్స్‌ భరతం పట్టే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా తెరపై నట ప్రభంజనాన్ని క్రియేట్‌ చేసి మరోసారి నంది అవార్డుని సొంతం చేసుకున్నారు. బిజినెస్‌మేన్‌ చిత్రంతో మరో సూపర్‌డూపర్‌ సక్సెస్‌ను కొట్టి బాక్సాఫీస్‌ వద్ద మరోమారు తన సత్తాను తెలియజేశారు.

విక్టరీ వెంకటేష్‌తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌లో నటించి మల్టీస్టారర్‌ చిత్రాల ట్రెండ్‌కు నాంది పలికి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు.

తండ్రికి తగ్గ తనయుడుగా ఎక్స్ పెరిమెంట్స్‌ చేయడంలో తాను ముందుటానని టక్కరిదొంగ' చిత్రంలో కౌబాయ్‌గా కనిపించడమే కాకుండా మరోసారి ఉత్తమ నటుడిగా స్పెషల్‌ జ్యూరీ అవార్డ్ ను కైవసం చేసుకున్న మహేష్‌ నిజం, నాని నేనొక్కడినే వంటి సైకలాజికల్‌ థ్రిల్లర్‌తో మరోసారి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి ప్రయోగాత్మక చిత్రాు చేయడంలో తానెప్పుడూ ముందుటానని చెప్పారు.

ప్రస్తుతం ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.బ్యానర్‌ను స్థాపించి, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి శ్రీమంతుడు చిత్రాన్ని నటిస్తూ నిర్మించారు.

ప్రతి ఎన్నారై తమ గ్రామాన్ని దత్తత్త తీసుకుని డెవలప్‌ చేయమని ప్రధాని మోడి చెప్పిన విషయాన్ని, యాదృచ్చికమైనా ఇప్పుడూ అదే కాన్సెప్ట్ తో చేసిన చిత్రం శ్రీమంతుడు'తో మన ముందుకు వచ్చారు. సినిమాలో ఎమాషన్స్ కంటెంట్ ను సరైన రీతిలో క్యారీ చేస్తూ మహేష్ ఇచ్చిన మెసేజ్ ప్రతి తెలుగువాడి హృదయానికి దగ్గరైంది. ఇలా తాను చేసే సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అభిమాన ధనుడుగా శ్రీమంతుడుగా నిలిలిచిన మహేష్ ఈరోజు(ఆగస్ట్‌ 9న) పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

..............హ్యపీ బర్త్ డే టు సూపర్ స్టార్ మహేష్....................

More News

'కొరియర్ బాయ్ కల్యాణ్' ఆడియో రిలీజ్ డేట్...

గురు ఫిలిమ్స్ ప్రొడక్షన్, మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ సమర్పణలో యంగ్ హీరో నితిన్, యామీ గౌతమ్ జంటగా

​'త్రిపుర' షూటింగ్ పూర్తి

స్వాతి టైటిల్ రోల్ లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన చిత్రం 'త్రిపుర'. తమిళ చిత్రం టైటిల్ 'తిరుపుర సుందరి'. జె. రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు,

'శ్రీమంతుడు' సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - 'శ్రీముంతుడు' యూనిట్

సూపర్‌స్టార్‌ మహేష్‌, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదలై మంచి సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది.

సెంటిమెంట్ ను దాటేసిన దర్శకుడు

తెలుగు ఇండస్ట్రీలో మొదటి చిత్రంతో సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన దర్శకులు సెకండ్ మూవీని ప్లాప్ గా మూట గట్టుకుంటారనే టాక్ ఉంది.

రీమేక్ సినిమాలో దక్షిణాది హీరోలు...

హాలీవుడ్ మూవీ ‘వారియర్’ సినిమా ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘బ్రదర్స్’ ఈ ఆగస్ట్ 14న సినిమా హిందీలో రిలీజ్ కానుంది.