అభిమానధనుడు..శ్రీమంతుడు..హ్యాపీ బర్త్ డే టు మహేష్..
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో కోట్లకు పడగలెత్తాడు, అయినా తనకు సింపుల్‌గా ఉండాలంటేనే ఇష్టం. కష్టాల్లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని దాని రూపు రేఖలు మార్చేస్తాడు. ఈ కథ వినడానికి సంపుల్‌గా ఉంది కదా..అని ఎవరైనా అనుకుంటారు. కానీ సూపర్‌స్టార్ మహేష్ అలా అనుకోలేదు. దర్శకుడు కొరటాల చెప్పిన లైన్ నచ్చి వెంటనే సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ప్రతి ఒక్కరూ పుట్టిన ఊరు కోసం ఏదైనా చేయాలనే సందేశంతో కాకుండా ఆచరణలో బుర్రిపాలెం, సిద్ధాపూర్ అనే రెండు గ్రామాలను దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
తండ్రికి తగ్గ తనయుడు...
తెలుగు సినిమాల్లో నూతనత్వాన్ని నింపి, అభిమానుల గుండెల్లో ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్‌గా నిలిచిపోయిన తండ్రి సూపర్‌స్టార్‌కృష్ణ నుండి నటవారసత్వాన్ని మరో స్థాయికి తీసుకెళుతూ సూపర్‌స్టార్ ఇమేజ్‌కి ఇమేజ్‌లా ఉంటూ తండ్రి అందించిన బాధ్యతను నేరవేరస్తూ ముందుకు సాగడం మహేష్‌కే చెల్లింది. అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, మెసేజ్ ఇస్తూ అమ్మాయిల కలల రాజకుమారుడుగా, యూత్ ఐకాన్‌గా విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా తనతో సినిమాలు చేసే దర్శ, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కలెక్షన్స్ కల్పతరువుగా, తెలుగు సినిమా మార్కెట్ దూకుడుని పెంచి తెలుగు పేక్షకుడికి గుండెల్లో చెరిగిపోని అభిమాన ధనాన్ని సంపాదించుకున్న 'శ్రీమంతుడు' సూపర్‌స్టార్ మహేష్‌కే చెల్లింది.
బాలనటుడు టు సూపర్‌స్టార్...
బాలనటుడిగా సినిమాల్లోకి నీడ సినిమాతో రంగ ప్రవేశం చేసి దర్శకరత్న దాసరితో పాటు, ప్రముఖ దర్శకుడు డూండీతో భవిష్యత్ సూపర్‌స్టార్‌గా ప్రశంసలు అందుకున్న మహేష్, శంఖారావం, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్నతమ్ముడు వంటి చిత్రాల్లో తనదైన నటనతో మురిపించి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1999లో విడుదలైన రాజకుమారుడు చిత్రంతో తొలిసారి హీరోగా తెలుగు తెరకు పరిచయమైన తిరుగులేని సక్సెస్‌ను సాధించిన ప్రిన్స్ మహేష్‌బాబు తొలి చిత్రంతోనే నూతన ఉత్తమ నటుడుగా స్పెషల్ జ్యూరీ 'నంది అవార్డ్' అందుకున్నారు. తెలుగు అనుంబంధాలకు, అప్యాయతలకు అద్దం పడుతూ మనిషికి కావాల్సింది సంకల్పబలం అది ఉంటే ఏదైనా సాధించవచ్చునని క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో మురారి చిత్రంతో ప్రూవ్ చేసే క్యారెక్టర్లో ఒదిగిపోయారు. ఈ చిత్రానికిగానూ ఉత్తమనటుడిగా స్పెషల్ జ్యూరీ అవార్డుని సొంతం చేసుకున్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్ అవార్డుని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుస విజయాలతో దూసుకొచ్చిన మహేష్ తీసుకున్న టర్న్ అతడు. స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మహేష్ నటనలోని కొత్త కోణాని ఆవిష్కరించింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి చిత్రంతో మహేష్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఆ సినిమాతో తెలుగు సినిమా వైపు మొత్తం ఇండియన్ సినిమానే తిరిగి చూసేలా కొత్త రికార్డులను సృష్టించారు. ఇదే హవాను దూకుడుతో మరోసారి ప్రూవ్ చేశారు. తనదైన కామెడి టైమింగ్‌తో నవ్విస్తూనే విలన్స్ భరతం పట్టే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తెరపై నట ప్రభంజనాన్ని క్రియేట్ చేసి మరోసారి నంది అవార్డుని సొంతం చేసుకున్నారు. బిజినెస్‌మేన్ చిత్రంతో మరో సూపర్‌డూపర్ సక్సెస్‌ను కొట్టి బాక్సాఫీస్ వద్ద మరోమారు తన సత్తాను తెలియజేశారు.
ప్రయోగాలకు వెరవని తత్వం...
మల్టీస్టారర్ చిత్రాలకు మళ్లీ నాంది పలికిన మహేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్ట్టరీ వెంకటేష్‌తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్లో నటించి మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్‌కు నాంది పలికి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో తానుముందుటానని 'టక్కరిదొంగ' చిత్రంలో కౌబాయ్‌గా కనిపించడమే కాకుండా మరోసారి ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరీ అవార్డ్‌ను కైవసం చేసుకున్న మహేష్ నిజం, నాని నేనొక్కడినే వంటి సైకలాజికల్ థ్రిల్లర్, బ్రహ్మూెత్సవం వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో మరోసారి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో తానెప్పుడూ ముందుటానని చెప్పారు.
నిర్మాతగా తొలి చిత్రంతోనే సక్సెస్....
కొరటాల శివ దర్శకత్వంలో పస్తుతం ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి.బ్యానర్‌ను స్థాపించి, మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి శ్రీమంతుడు చిత్రాన్ని నటిస్తూ నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మహేష్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. బాహుబలి తర్వాత వందకోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించిన చిత్రంగా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడమే కాకుండా అనేక అవార్డులను తెచ్చిపెట్టింది.
మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో 120 కోట్ల భారీ బడ్జెట్
ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మాతలుగా వందకోట్లకు పైగా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ హిట్ కాంబినేషన్లో రానున్న సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఆగస్ట్ 9న సూపర్‌స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజు జరుపుకుంటున్న సూపర్‌స్టార్ మహేష్‌కి బర్త్ డే విషెష్‌ను తెలియజేస్తోంది ఇండియా గ్లిజ్డ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments