హ్యాపీ బర్త్ డే టు మెగాస్టార్ చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి....తెలుగు సినీ ప్రేక్షకాభిమానులకు పెద్దగా పరిచయంఅక్కర్లేని పేరు. తెలుగు స్టామినాను విదేశాలకు చాటడమే కాకుండా మాస్ ఇమేజ్‌కు కొత్త అర్తాన్ని చెప్పిన కథానాయకుడుగా కూడా చిరంజీవి తనదైన గీటురాయిని ఏర్పరిచాడు. డ్యాన్సులు, ఫైట్స్‌తో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన హీరో చిరు. ఒక జనరేషన్‌కు నెంబర్‌వన్ హీరోగా నిలిచి తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసి ట్రెండ్ సెట్టర్ అయ్యారు.
డ్యాన్స్ కింగ్....
టాలీవుడ్లో అప్పటి వరకు హీరోలువేసే డ్యాన్సుల అర్డాలను మార్చి ఓ కల్ట్ ఫిగర్‌గా ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి డ్యాన్స్ ఓ సంచలనం. అప్పటికి, ఇప్పటికి..ఎప్పటికీ చిరునే ది బెస్ట్. ఆయన కాలు కదిపినా, స్టెప్ వేసినా బాక్సాఫీస్ మోతే. స్లో మూమెంట్ స్టెప్ అయినా, ఫాస్ట్ బీట్ స్టెప్ అయినా చిరునే చేయాలనేంతగా కేరాఫ్ అయ్యారు. ఈ జనరేష్న్ హీరోలు కూడా తమ డ్యాన్సులను చిరంజీవితోనే పోల్చుకుని ఆయనలా చేయాలని కష్టపడుతుంటారు. బ్రేక్ డ్యాన్స్, మూన్ డ్యాన్స్, షేక్ డ్యాన్స్, స్పీడ్ డ్యాన్స్ ఇలా కొత్త డ్యాన్సులతో 80వ దశాబ్ద సంగీతంలో పుట్టుకొచ్చిన ఎన్నో కొత్త స్టెప్పులను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. నాటి, నేటి తరం ప్రేక్షకులకు ఓ కొత్త కిక్‌ను అందించారు. నటనతో పాటు డ్యాన్సులే చిరంజీవిని తిరుగులేని హీరోగా జనంలో నిలబెట్టింది
వెరైటీ మేనరిజమ్స్...
డ్యాన్సులతో పాటు వెరైటీ మేనరిజమ్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేవారు చిరంజీవి.చెయ్యి చూడు ఎంత రఫ్‌గా ఉందో రఫ్ ఆడించేస్తా, కొడితే బాక్స్ బద్ధలౌతుంది. పేస్ కొద్దిగా టర్నింగ్ ఇచ్చుకో,.. ఇలాంటి మేనరిజమ్స్ ఇప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేనంతగా గుర్తుండిపోవడానికి ఆయనే కారణం.
విలక్షణ పాత్రలతో మెప్పు...
చిరు అంటే డ్యాన్సులే కాదు..విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. చంటబ్బాయ్, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు, ఇలా డిపరెంట్ పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించారు. హీరోయిజంతో పాటు తిరుగులేని కామెడి టైమింగ్ చిరు సొంతం. అందుకే ఆయన నటనాశైలి జనాలకు గుర్తుండిపోయింది.
బాలీవుడ్‌లోనూ...
టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో సైతం తనదైన శైళిలో మెప్పించారు. అక్కడ ఆయన నటించిన ప్రతిబంధ్, ఆజ్కా గూండారాజ్ చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
చినుకులా మారి..సంద్రమై....
ప్రాణం ఖరీదు చిత్రంతో ప్రారంభైన కెరీర్లో ఆయన మెగాస్టార్ రేంజ్‌కి చేరుకోవడంలో అనేక సవాళ్లను ఎదుర్కొని వాటికి ధీటుగా తన సినిమాలతో బదులిస్తూ టాప్ రేంజ్‌కి చేరుకున్నారు. 1979లో 'ప్రాణం ఖరీదు'తో ప్రారంభమైన చిరంజీవి నట జీవితం 'మనవూరి పాండవులు, తాయరమ్మ బంగారయ్య, ఇది కథ కాదు, శ్రీరామబంటు, కోతలరాయుడు, పున్నమినాగు, మొగుడు కావాలి, న్యాయం కావాలి, చట్టానికి కళ్ళులేవు, కిరాయిరౌడీలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, పల్లెటూరి మొనగాడు, అభిలాష, గూఢచారి నెం.1, మగమహారాజు' వంటి విజయవంతమైన చిత్రాలతో దిగ్విజయంగా కొనసాగింది.
ఖైదీతో స్టార్ డమ్ ...
చిరంజీవి అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చే సినిమా ఖైదీ. చిరు స్టార్‌డమ్‌ను అమాంతం మార్చేసిన సినిమా. ఖైదీ ముందు...ఖైదీ తర్వాత అనేంతలా ఆయన ఇమేజ్ మారిపోయింది. 1983లో వచ్చిన 'ఖైదీ' చిత్రం చిరంజీవిని స్టార్ హీరోగా మార్చింది. 'ఖైదీ' సాధించిన సక్సెస్‌తో చిరంజీవి సుప్రీమ్ హీరో అయ్యారు. తర్వాత వచ్చిన 'మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్, ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం, దొంగ' వంటి కమర్షియల్ చిత్రాాల సక్సెస్‌తో ఆయన రేంజ్ మరింత పెరిగింది. 1985లో విడుదలైన 'అడవి దొంగ' ఘన విజయంతో చిరంజీవి పెద్ద స్టార్ హీరోగా ఎదిగారు. 'విజేత, కొండవీటి రాజా, మగధీరుడు, చంటబ్బాయ్, రాక్షసుడు, దొంగమొగుడు' చిత్రాలు చిరంజీవి స్టార్ ఇమేజ్‌ని పెంచుకుంటూ వచ్చాయి.
సంచనాలకు కేరాఫ్...
1987లో వచ్చిన 'పసివాడి ప్రాణం' సంచలన విజయం చిరంజీవిని మరింత పెద్ద రేంజ్‌కు తీసుకెళ్ళింది. 'స్వయంకృషి'తో ఉత్తమ నటుడు అవార్డు అందుకొని 'మంచిదొంగ'తో కమర్షియల్ సక్సెస్ కొట్టి , 'రుద్రవీణ'ని సొంతంగా నిర్మించి జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న సుప్రీమ్ హీరో చిరంజీవి 'యముడికి మొగుడు'తో కొత్త రికార్డులు సృష్టించారు. 'ఖైదీ నెంబర్ 786' తర్వాత 'మరణ మృదంగం'తో మెగాస్టార్ అయ్యారు. 100వ చిత్రం 'త్రినేత్రుడు'తో మంచి విజయం సాధించారు. 'స్టేట్‌రౌడి, కొండవీటి దొంగ' వంటి వరుస విజయాలను సాధించారు. 1990లో విడుదలైన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చిత్రంతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు. గ్యాంగ్‌లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు' ఇలా ఒకదాన్ని మించిన మరొక బ్లాక్ బస్టర్‌ని ఇచ్చి హ్యాట్రిక్ సాధించడమే కాదు 'ఘరానా మొగుడు'తో తెలుగు సినిమా స్టామినాను పెంచారు. ముగ్గురు మొనగాళ్ళు, అల్లుడా మజాకా' వంటి కమర్షియల్ హిట్స్ కూడా సాధించారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా స్టయిల్ మార్చి 'హిట్లర్, మాస్టర్, బావగారూ బాగున్నారా, చూడాలని వుంది, స్నేహం కోసం, అన్నయ్య, శ్రీమంజునాథ' వంటి వరుస హిట్స్ సాధించారు. 2002 లో విడుదలైన 'ఇంద్ర'తో మళ్ళీ తన రికార్డుల్ని తానే క్రాస్ చేసుకోవడమే కాక తెలుగు సినిమా రేంజ్‌ని మరింత పెంచారు. 2003 లో వచ్చిన 'ఠాగూర్'తో మళ్ళీ తన సత్తా చూపించారు. 2004 లో 'శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్'తో మరో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఎవర్గ్రీన్ మెగాస్టార్‌గా బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. 'స్టాలిన్'తో మరో మంచి హిట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'శంకర్‌దాదా జిందాబాద్' రాజకీయాల్లో ప్రవేశించారు. మధ్యలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ 'మగధీర'లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చి ప్రేక్షకుల్ని అలరించారు.
నటవారసులు.....
మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఫ్యామిలీ నుండి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్ హీరోలుగా ప్రేక్షకుల ఆదరణ పొందారు. రీసెంట్గా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోలుగా పరిచయమై సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్నారు.
ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ...150వ చిత్రం...
రాజకీయాల నుండి దాదాపు తొమ్మిదేళ్ళ తర్వా త సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మెగాస్టార్ నటించిన 149 చిత్రాలు ఓ ఎత్తు అయితే 150వ చిత్రం ఒక్కటీ మరో ఎత్తు అవుతుంది. ఆ రేంజ్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తనయుడు, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ్ నిర్మాతగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. అన్నీ కమర్షియల్ హంగులతో అటు ప్రేక్షకులు ఆనందపడేలా, ఇటు అభిమానులు గర్వపడేలా డైరెక్టర్ వినాయక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కలెక్షన్స్ సునామీతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుని రూపకల్పన చేస్తున్నారు. ఓ వ్యక్తిగా ఇండస్ట్రీకి వచ్చి.. ఓ మహా శక్తిగా, పద్మ భూషణ్ అవార్డ్ గ్రహీతగా ఎదిగిన డా. చిరంజీవి మళ్ళీ 150వ చిత్రంతో విజృంభించి.. మెగాపవర్ని చూపించాలని అందరూ కోరుకుంటూ హ్యపీ బర్త్ డే టు మెగాస్టార్ చిరంజీవి....
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout