జ్యోతిల‌క్ష్మికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు..

  • IndiaGlitz, [Tuesday,May 17 2016]

నీతోడు కావాలి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి. అనుకోకుండా ఒక రోజు, మాస్, ల‌క్ష్మీ, పౌర్ణ‌మి, రాఖీ త‌దిత‌ర చిత్రాల‌తో ఆడియోన్స్ ను ఆక‌ట్టుకుంది. 2007 లో ఛార్మి మంత్ర సినిమాతో ప్రేక్ష‌కులను భ‌య‌పెట్టింది. ఈ చిత్రంలో న‌ట‌న‌కు గాను ఛార్మి ఉత్త‌మ క‌థానాయిక‌గా నంది అవార్డ్ అందుకుంది. ఆత‌ర్వాత 2011లో మంగ‌ళ చిత్రానికి స్పెష‌ల్ జ్యూరీ అవార్డ్ సొంతం చేసుకుంది.

అలాగే ఇదే సంవ‌త్స‌రంలో అమితాబ్ తో బుడ్డా హోగా తేరా బాప్ చిత్రంలో న‌టించి బాలీవుడ్ లోను స‌క్సెస్ సాధించింది. తెలుగు, హిందీ తో పాటు త‌మిళ్, మ‌ల‌యాళ చిత్రాల్లో కూడా ఛార్మి న‌టించి మెప్పించింది. ఇటీవ‌ల ఛార్మి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జ్యోతిల‌క్ష్మీ చిత్రంలో న‌టించింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న జ్యోతిల‌క్ష్మీ చిత్రంతో ఛార్మి నిర్మాత‌గా కూడా మారింది. భ‌విష్య‌త్ లో నిర్మాత‌గా మ‌రిన్ని చిత్రాలు నిర్మించాల‌నుకుంటున్న జ్యోతిల‌క్ష్మి (ఛార్మి) హ్యాపీ బ‌ర్త్ డే అండ్ ఆల్ ది బెస్ట్.