హ్యాపీ బర్త్ డే టు అమల అక్కినేని..!
Send us your feedback to audioarticles@vaarta.com
క్లాసిక్ డాన్సర్ గా..కధానాయికగా...బాధ్యత గల ఇల్లాలిగా..మాతృమూర్తిగా..బ్రూ క్రాస్ సొసైటీ ఫౌండర్ గా....ఇలా ప్రతి దశలోను ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న గొప్ప మానవతామూర్తి శ్రీమతి అమల అక్కినేని. సెప్టెంబర్ 12 అమల పుట్టినరోజు. ఈ సందర్భంగా అక్కినేని అమల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం...
అమల పేరు వెనుక రహాస్యం..
అమల తల్లిదండ్రుల పేరు ముఖర్జీ, జెన్నీఫర్. అమల తల్లిదండ్రులకు నాట్యం అంటే మక్కువ ఎక్కువ. ప్రముఖ నాట్యాచార్యులు అమల ఉదయ్ శంకర్ అంటే అభిమానం. ఆయన పట్ల ఉన్న గౌరవభావం కారణంగానే తమ కుమార్తెకు అమల ముఖర్జీ అని నామకరణం చేసారట. అమల చెన్నై కళాక్షేత్రలో బి.ఏ ఫైన్ ఆర్ట్స్ చేసారు.
క్లాసికల్ డాన్సర్..
అమలకి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం. అందుకే చిన్నతనం నుంచి క్లాసికల్ డాన్స్ లో శిక్షణ తీసుకున్నారు. కాలేజీ వార్షికోత్సవాల్లో పలు సందర్భాల్లో క్లాసికల్ డాన్స్ ప్రదర్శనలిచ్చి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. అద్భుత కళాకారిణిగా ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు.
హీరోయిన్ గా తొలి అవకాశం..
ప్రముఖ దర్శకులు టి.రాజేందర్ మైథీలీ నీ ఎన్నైకాదలి అనే చిత్రంలో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారట. ఈ చిత్రంలో కధానాయిక పాత్ర నృత్య కళాకారిణి. కనుక నృత్యం తెలిసిన కొత్త అమ్మాయితో ఆ పాత్ర చేయిస్తే ఆ పాత్రకు, చిత్రానికి మరింత నిండుతనం వస్తుందనుకున్నారట. సరిగ్గా ఆ సమయంలో చెన్నై కళాక్షేత్రలో ఓ క్లాసికల్ డాన్స్ ప్రదర్శన ఇస్తోన్న అమలని చూసారట డైరెక్టర్ రాజేందర్. తమ చిత్రంలో పాత్రకు కావలసిన అర్హతలన్నీ ఆ అమ్మాయిలో పుష్కలంగా ఉన్నాయని భావించి అడగడం జరిగిందట. అభినయ ప్రధానమైన పాత్ర కావడంతో తనలోని కళాకారిణికి కూడా సరైన గుర్తింపు లభిస్తుందన్న ఉద్దేశ్యంతో అమల ఆ పాత్రను అంగీకరించారట. అలా అమల అరంగేట్రం జరిగింది.
తెలుగులో అవకాశం...
తెలుగులో కిరాయిదాదా, చినబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం తదితర చిత్రాల్లో నటించారు. శివ సినిమాలో నటిస్తున్నప్పుడు నాగ్ తో పరిచయం పెరిగింది. ఇద్దరి ఆశ, ఆశయాలు ఒక్కటే కావడంతో పరిచయం కాస్త...పరిణయానికి దారి తీసింది. ఎన్నో వైవిధ్యమైన కధానాయిక పాత్రలను పోషించి మెప్పించారు. తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో విభిన్న పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఉత్తమ నటి అవార్డులతో పాటు పలు విశిష్ట పురస్కారాలను అందుకున్నారు అమల.
బ్లూ క్రాస్ సొసైటీ...
అమలకు చిన్నతనం నుంచి పరులకు సేవ చేయాలనే తత్వం.మనకు బాధ కలిగితే నోరు ఉంది కాబట్టి ఇతరులకు చెప్పుకుంటాం. అదే మూగజీవాలకు బాధ కలిగితే....అమలకి వచ్చిన ఈ ఆలోచనే బ్లూక్రాస్ సొసైటీ స్టార్ట్ చేసేలా చేసింది. నోరు లేని మూగజీవులు ఆపద సమయంలో ఎదుర్కొనే బాధను చూసి తట్టుకోలేక మూగజీవులను కాపాడాలనే లక్ష్యంతో నాగ్ సహకారంతో బ్లూక్రాస్ సొసైటీ స్ధాపించి గత కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు.
నాగ్ గురించి అమల..
నాగ్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే...బ్రతికే ప్రతిక్షణం ఏదో రకంగా ఇతరులకు ఉపయోగపడాలి అంటారు. సంపూర్ణ మానవతామూర్తి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం నాగార్జున అని చెబుతారు.ఇల్లాలిగా తన బాధ్యత సంపూర్ణంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతోనే గత కొన్నేళ్ళుగా నటనకు ఫుల్ స్టాఫ్ పెట్టారు. హూస్ వైప్ అనేది పార్ట్ టైం జాబ్ కాదు...కనుకనే ఇల్లాలు పాత్ర అనేది ఎంతో విశిష్టమైనది ఎంతో బాద్యతతో చేయదగింది అంటారు. ఇంత కాలం నటకు దూరంగా ఉన్న అమల ఇటీవల శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించారు. అలాగే అక్కినేని కుటుంబం నిర్మించిన అద్భుత చిత్రం మనంలో కనిపించి అలరించారు.
స్వచ్చ భారత్ బ్రాండ్ అంబాసిడర్..
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వఛ్చ భారత్ కార్యక్రమానికి అమల బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గత సంవత్సరం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పలువురు తారలకు తన భవన్ లో స్పెషల్ టీ పార్టీ ఇచ్చారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అమల పాల్గొనడం విశేషం. ఇలా...తనదైన శైలిలో సమాజసేవ చేస్తూ...ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న గొప్ప మానవతామూర్తి అమల అక్కినేని గార్కి బర్త్ డే విషెష్ తెలియచేస్తుంది ఇండియా గిల్ట్జ్.కామ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout