హ్యాపీ బ‌ర్త్ డే టు అమ‌ల అక్కినేని

  • IndiaGlitz, [Saturday,September 12 2015]

విద్యావంతురాలుగా...క్లాసిక్ డాన్స‌ర్ గా..క‌ధానాయిక‌గా...బాధ్య‌త గ‌ల ఇల్లాలిగా..మాత్రుమూర్తిగా..బ్రూ క్రాస్ సొసైటీ ఫౌండ‌ర్ గా....ఇలా ప్ర‌తి ద‌శ‌లోనూ ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్న గొప్ప మాన‌వ‌తామూర్తి శ్రీమ‌తి అమ‌ల అక్కినేని. సెప్టెంబ‌ర్ 12 అమ‌ల పుట్ట‌న‌రోజు. ఈ సంద‌ర్భంగా అక్కినేని అమ‌ల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకోసం..

అమ‌ల పేరు వెనుక ర‌హాస్యం..

అమ‌ల తల్లిదండ్రుల పేరు ముఖ‌ర్జీ, జెన్నీఫ‌ర్. అమ‌ల త‌ల్లిదండ్రుల‌కు నాట్యం అంటే మ‌క్కువ ఎక్కువ‌. ప్ర‌ముఖ నాట్యాచార్యులు అమ‌ల ఉద‌య్ శంక‌ర్ అంటే అభిమానం. ఆయ‌న ప‌ట్ల ఉన్న గౌర‌వ‌భావం కార‌ణంగానే త‌మ కుమార్తెకు అమ‌ల ముఖ‌ర్జీ అని నామ‌క‌ర‌ణం చేసార‌ట‌. అమ‌ల‌ చెన్నై క‌ళాక్షేత్ర‌లో బి.ఏ ఫైన్ ఆర్ట్స్ చేసారు.

క్లాసిక‌ల్ డాన్సర్..

అమ‌ల‌కి చిన్న‌ప్ప‌టి నుంచి క్లాసిక‌ల్ డాన్స్ అంటే ఇష్టం. అందుకే చిన్న‌త‌నం నుంచి క్లాసిక‌ల్ డాన్స్ లో శిక్ష‌ణ తీసుకున్నారు. కాలేజీ వార్షికోత్స‌వాల్లో ప‌లు సంద‌ర్భాల్లో క్లాసిక‌ల్ డాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చి అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకున్నారు. అద్భుత క‌ళాకారిణిగా ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు.

హీరోయిన్ గా తొలి అవ‌కాశం..

ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు టి.రాజేంద‌ర్ మైథీలీ నీ ఎన్నైకాద‌లి అనే చిత్రంలో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నార‌ట‌. ఈ చిత్రంలో క‌ధానాయిక పాత్ర న్రుత్య క‌ళాకారిణి. క‌నుక న్రుత్యం తెలిసిన కొత్త అమ్మాయితో ఆ పాత్ర చేయిస్తే ఆ పాత్ర‌కు, చిత్రానికి మ‌రింత నిండుత‌నం వ‌స్తుంద‌నుకున్నార‌ట‌. స‌రిగ్గా ఆ స‌మ‌యంలో చెన్నై క‌ళాక్షేత్ర‌లో ఓ క్లాసిక‌ల్ డాన్స్ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తోన్న అమ‌ల‌ని చూసార‌ట డైరెక్ట‌ర్ రాజేంద‌ర్. త‌మ చిత్రంలో పాత్ర‌కు కావ‌ల‌సిన అర్హ‌త‌ల‌న్నీ ఆ అమ్మాయిలో పుష్క‌లంగా ఉన్నాయ‌ని భావించి అడ‌గ‌డం జ‌రిగిందట‌. అభిన‌య ప్ర‌ధాన‌మైన పాత్ర కావ‌డంతో త‌న‌లోని క‌ళాకారిణి కూడా స‌రైన గుర్తింపు ల‌భిస్తుంద‌న్న ఉద్దేశ్యంతో అమ‌ల ఆ పాత్ర‌ను అంగీక‌రించ‌డం జ‌రిగింది. అలా అమ‌ల అరంగేట్రం జ‌రిగింది.

తెలుగులో అవ‌కాశం...

తెలుగులో కిరాయిదాదా, చిన‌బాబు, ప్రేమ యుద్ధం త‌దిత‌ర‌ చిత్రాల్లో న‌టించారు. శివ సినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు నాగ్ తో ప‌రిచ‌యం పెరిగింది. ఇద్ద‌రి ఆశ‌, ఆశ‌యాలు ఒక్క‌టే కావ‌డంతో ప‌రిచ‌యం కాస్త‌...ప‌రిణ‌యానికి దారి తీసింది. ఎన్నో వైవిధ్య‌మైన‌ క‌ధానాయిక పాత్ర‌ల‌ను పోషించి మెప్పించారు. తెలుగు,త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఎన్నో విభిన్న పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు. ఉత్త‌మ న‌టి అవార్డుల‌తో పాటు ప‌లు విశిష్ట పుర‌స్కారాల‌ను అందుకున్నారు అమ‌ల‌.

బ్లూ క్రాస్ సొసైటీ...

అమ‌లకు చిన్న‌త‌నం నుంచే ప‌రుల‌కు సేవ చేయాల‌నే త‌త్వం.మ‌న‌కు బాధ క‌లిగితే నోరు ఉంది కాబ‌ట్టి ఇత‌రుల‌కు చెప్పుకుంటాం. అదే మూగ‌జీవాల‌కు బాధ క‌లిగితే....అమ‌ల‌కి వ‌చ్చిన‌ ఈ ఆలోచ‌నే బ్లూక్రాస్ సొసైటీ స్టార్ట్ చేసేలా చేసింది. నోరు లేని మూగ‌జీవులు ఆప‌ద స‌మ‌యంలో ఎదుర్కొనే బాధ‌ను చూసి త‌ట్టుకోలేక మూగ‌జీవుల‌ను కాపాడాల‌నే ల‌క్ష్యంతో నాగ్ స‌హ‌కారంతో బ్లూక్రాస్ సొసైటీ స్ధాపించి గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా సేవ చేస్తున్నారు.

నాగ్ గురించి అమ‌ల‌..

నాగ్ గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మంటే...బ్ర‌తికే ప్ర‌తిక్ష‌ణం ఏదో ర‌కంగా ఇత‌రుల‌కు ఉప‌యోగ‌ప‌డాలి అంటారు. సంపూర్ణ మాన‌వ‌తామూర్తి అనే ప‌దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం నాగార్జున‌ అని చెబుతారు.ఇల్లాలిగా త‌న బాధ్య‌త సంపూర్ణంగా నిర్వ‌హించాల‌నే ఉద్దేశ్యంతోనే గ‌త కొన్నేళ్ళుగా ట‌న‌కు ఫుల్ స్టాఫ్ పెట్టారు. హూస్ వైప్ అనేది పార్ట్ టైం జాబ్ కాదు...క‌నుక‌నే ఇల్లాలు పాత్ర అనేది ఎంతో విశిష్ట‌మైన‌ది ఎంతో బాద్య‌త‌తో చేయ‌ద‌గింది. అంటారు. ఇంత కాలం న‌ట‌కు దూరంగా ఉన్న అమ‌ల ఇటీవ‌ల శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో న‌టించారు.

స్వ‌చ్చ భార‌త్ బ్రాండ్ అంబాసిడ‌ర్..

భార‌త ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప్ర‌వేశ‌పెట్టిన స్వ‌ఛ్చ భార‌త్ కార్య‌క్ర‌మానికి అమ‌ల బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పలువురు తారలకు తన రాష్ట్రపతి భవన్ లో స్పెషల్ టీ పార్టీ ఇచ్చారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మంలో అమ‌ల పాల్గొని పాల్గొన్నారు. ఇలా...త‌న‌దైన శైలిలో స‌మాజ‌సేవ చేస్తూ...ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్న గొప్ప మాన‌వ‌తామూర్తి అమ‌ల అక్కినేని గార్కి బ‌ర్త్ డే విషెష్ తెలియ‌చేస్తుంది ఇండియా గిల్ట్జ్.కామ్.

More News

తిరుప‌తిలో మ‌హేష్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు.

మ‌గ‌ధీర లో చెప్పింది ఇప్పుడు నిజం కానుందా..?

మ‌గ‌ధీర లో చెప్పింది ఇప్పుడు నిజం కానుందా..? అంటే దేని గురించి అబ్బా...అంటూ తెగ ఆలోచిస్తున్నారా..?

హీరోయిన్స్‌పై జ్యోతిక కామెంట్‌...

సినిమాల్లో ఫిజిక్ కంటే పెర్‌ఫార్మెన్స్ ముఖ్య‌మంటుంది న‌టి జ్యోతిక‌. హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న జ్యోతిక

'క‌బాలి' బాషా కాదంటున్న ర‌జ‌నీ

బాషా సినిమా పేరు చెప్తేనే ఓ సెన్సేష‌న్ ఉంటుంది. ఓ వైబ్రేష‌న్ ఉంటుంది. ఆ ఫార్ములాతో ఆ త‌ర్వాత ఎన్ని సినిమాలు వ‌చ్చాయో ఎవ‌రికీ తెలియ‌దు.

హారీష్ పాత‌క‌థ ప్ర‌య‌త్నం ఫ‌లించేనా..?

హారీష్ శంక‌ర్..మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ‌తో తెర‌కెక్కిస్తున్న చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.