హ్యపీ బర్త్ డే టు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్
- IndiaGlitz, [Saturday,April 08 2017]
మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మేనల్లుడు, సీనియర్ కమెడియన్ అల్లురామలింగయ్య మనవడు, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తనదైన గుర్తింపు సంపాదించుకుని స్టైల్ ఐకాన్‌గా మారాడు. 'విజేత' చిత్రంలో బాలనటుడుగా నటించిన అల్లు అర్జున్ అలియాస్ బన్ని, మెగాస్టార్ చిరంజీవి 'డాడీ' చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'గంగోత్రి' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన బన్ని, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆర్య'తో ఆర్య బ్లాక్‌బస్టర్‌తో స్టైలిష్ స్టార్‌గా మారారు.
తర్వాత అల్లు అర్జున్ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'బన్ని'తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హ్యాపి'తో క్లాస్‌కి మరింత దగ్గరయ్యాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'దేశముదురు'తో సిక్స్‌ప్యాక్ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి స్టార్ హీరోగా ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు. 'పరుగు'తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నారు. ఆర్య-2'తో యూత్‌లో క్రేజ్ మరింత పెంచుకున్నారు. 'వరుడు'లో తన ఇమేజ్‌కు భిన్నమైన రోల్‌ని కూడా అందరికీ నచ్చేలా చేసిన బన్ని, 'వేదం'లాంటి డిఫరెంట్ సినిమాలో నటుడిగా తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. 'బద్రినాథ్'తో ఆల్‌రౌండర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని అందుకున్నారు.
స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రవమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'జులాయి'లో తనదైన స్టైలిష్ పెర్‌ఫార్మెన్స్‌తో సూపర్‌డూపర్ హిట్ కొటారు. ఇద్దరమ్మాయిలు చిత్రంలో లవరబోయ్‌గా మెప్పించిన బన్ని కిక్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'రేసుగుర్రం'తో బ్లాక్‌బస్టర్ హీరోగా మారారు. సన్నాఫ్ సత్యమూర్తి సక్సెస్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైన అల్లు అర్జున్, అనుష్క టైటిల్ పాత్రలో నటించిన 'రుద్రమదేవి' చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రలో మెపించి 2016 ఫిలింఫేర్ అవార్డును కైవసం సొంతం చేసుకున్నారు. మాస్ డైర్టెర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'సరైనోడు' సెన్సేషనల్ హిట్‌తో వందకోట్ల క్లబ్ హీరోగా మారారు.
సమ్మర్‌లో దువ్వాడ జగన్నాథమ్‌గా సందడి
గబ్బర్‌సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌తో ఆర్య, పరుగు చిత్రాల నిర్మించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బానర్‌లో రూపొందుతోన్న చిత్రం 'డిజె దువ్వాడ జగన్నాథమ్'. బన్ని, దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతోన్న హాట్రిక్ చిత్రం ఇది. అంతే కాకుండా బన్నికి ఎన్నో మ్యూజికల్ హిట్స్‌ను అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రనాఇకి సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ పదిమిలియన్ వ్యూవర్స్‌ను సాధించింది. దువ్వాడ జగన్నాథమ్ సినిమా కోసం పేక్షకులు, అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
అల్లు అర్జున్ టు మల్లు అర్జున్
'గంగోత్రి' నుండి 'జులాయి' వరకు సినిమా సినిమాకి హీరోగా రేంజ్ పెంచుకుంటున్న అల్లు అర్జున్ మలయాళంలో మల్లు అర్జున్‌గా ఎంతో పాపులారిటీని సంపాదించుకోవడం విశేషం. 'బన్ని' నటించిన అన్ని సినిమాలూ మలయాళంలో ఘన విజయాలు సాధించడమే కాదు 'బన్ని' ఏ తెలుగు సినిమాలో నటించడానికి అంగీకరించినా మలయాళం రైట్స్ కోసం భారీ ఆఫర్స్‌తో మలయాళ నిర్మాతలు పోటీలు పడతారు. మలయాళ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ మార్కెట్‌ని సంపాదించుకున్న తెలుగు హీరోగా అల్లు అర్జున్ ముందంజ వేశారు.
వక్కంతం వంశీ దర్శకత్వంలో....
ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. 'నా పేరు శివ-నా ఇల్లు ఇండియా' టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్ని ఓ డిఫరెంట్ పాత్రలో కనపడబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్ళనుంది. తెలుగు, మలయాళంలో తనదైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న అల్లుఅర్జున్ ఇప్పుడు తమిళంలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఇలా వరుస విజయాలు సాధిస్తూ హీరోగా ఓ స్పెషల్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్‌డే చెపుతూ.. మరిన్ని విజయాలు సాధించాలని కోరుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు.