హ్యాపీ బర్త్ డే టు నేచురల్ స్టార్ నాని..

  • IndiaGlitz, [Wednesday,February 24 2016]

అష్టాచ‌మ్మా సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన యువ క‌థానాయ‌కుడు నాని. తొలి చిత్రంతోనే శ‌భాష్ అనిపించుకున్ననాని రైడ్, స్నేహితుడా, భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టు చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. ఆత‌ర్వాత అలా...మొద‌లైంది, పిల్ల జ‌మీందార్, ఈగ చిత్రాల‌తో నాని యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌చుకున్నాడు. నానిని చూడగానే మ‌న ప‌క్కింటి కుర్రాడులా ఉన్నాడే అనిపించ‌డం...దానికి తోడు నాని న‌ట‌న కూడా చాలా స‌హ‌జంగా ఉండ‌డంతో ఏకంగా నేచుర‌ల్ స్టార్ అయిపోయాడు. పైసా, ఆహా క‌ళ్యాణం, జెండా పై క‌పిరాజు...చిత్రాల‌తో వ‌రుస‌గా ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించినా కృంగిపోలేదు.
త‌నేంటో తెలుసుకున్నాడు మ‌ళ్లీ వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నాడు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌...ఇలా వ‌రుస విజ‌యాల‌తో హ్యాట్రిక్ సాధించి దూసుకెళుతున్నాడు నాని. స్టార్ హీరోలు, సీనియ‌ర్ హీరోల‌కు సైతం యు.ఎస్ లో ద‌క్క‌ని 1 మిలియ‌న్ మార్క్ నాని చాలా సులువుగా సాధించడంటే నాని కి క్రేజ్ ఏరేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ హ్యాట్రిక్ హీరో & నేచుర‌ల్ స్టార్ నాని పుట్టిన‌రోజు ఈ రోజు. ఈ సంద‌ర్భంగా నాని మ‌రిన్నివిజ‌యాలు సాధించాల‌ని కోరుకుంటూ బ‌ర్త్ డే విషెష్ తెలియ‌చేస్తుంది ఇండియా గిల్ట్జ్.కామ్.

More News

పాటపాడనున్న హీరో

డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో నారా రోహిత్.

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూనంకౌర్....

పలు తెలుగు చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు బాయ్ ఫ్రెండ్ కరణ్ సింగ్ గ్రోవర్ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం.

ఆ టైటిల్ కాదంటున్న మెగాహీరో..

సాయిధరమ్ తేజ్ హీరోగా ఇప్పుడు ‘సుప్రీమ్’సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

ఢిల్లీ లో బ్ర‌హ్మోత్స‌వం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ బ్ర‌హ్మోత్స‌వం. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది.

హిట్ కాంబినేష‌న్ రిపీట్ చేయ‌నున్ననితిన్..

నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నచిత్రం అ ఆ. ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.