నవ యువ సంచలనం నాగ చైతన్య..హ్యాపీ బర్త్ డే
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని వంశం మూడోతరం కథానాయకుడుగా తెలుగు తెరకు పరిచయమైన నవ యువ సంచలనం నాగ చైతన్య. నాగార్జున వారసుడుగా పరిచయమైన నాగ చైతన్య అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్నాడు. నవంబర్ 23 నాగ చైతన్య పుట్టినరోజు. అభిమానుల్లో జోష్ నింపే రోజు. ఈ సందర్భంగా నాగ్ చైతన్య గురించి క్లుప్తంగా మీకోసం...
నటనకు నిలువెత్తు నిదర్శనం డా.అక్కినేని. ఆయన పోషించని పాత్ర లేదు. ఆయనకు రాని అవార్డ్ లేదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు తెరపై ఎన్నో..ఎన్నెన్నో..వైవిధ్యమైన పాత్రలతో సుస్ధిర స్ధానం ఏర్పరుచుకుని తనకంటూ సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారు మహానటుడు నట సమ్రాట్ డా. అక్కినేని. ఆయన వారస్వతాన్ని అందుకుని తెలుగు ఇండస్ట్రీలో హీరోగా పరిచయమైన అక్కినేని వారసుడు నాగార్జున. విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయమైన నాగార్జున భగ్న ప్రేమికుడుగా, భక్తుడుగా, రొమాంటిక్ కింగ్ గా..ఇలా ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేసి...ఈతరంలో ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు పోషించిన కథానాయకుడుగా తనకంటూ ఓ సుస్ధిర స్ధానాన్ని ఏర్పరుచుకున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున.
అక్కినేని అభినయం, నాగార్జున అందం పుణికి పుచ్చుకుని కింగ్ నాగార్జున వారసుడుగా తొలి ప్రయత్నం గా జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై..నటుడుగా శభాష్ అనిపించుకున్నాడు నాగ చైతన్య. మలి ప్రయత్నంగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏమాయ చేసావే చిత్రంలో లవర్ బాయ్ గా అద్భుతంగా నటించి తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆతర్వాత సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాలో పాత్రకు తగ్గ అభినయం ప్రదర్శించి మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఏమాయ చేసావే, 100% లవ్...ఈ రెండు రొమాంటిక్ మూవీస్ తో సూపర్ సక్సెస్ సాధించిన చైతన్య మాస్ ప్రేక్షకులను కూడా మెప్పించాలని చేసిన దడ, బెజవాడ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. అయితే మాస్ ప్రేక్షకులను మెప్పించాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా...ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఆఖరికి చైతన్య మాస్ ప్రయత్నం ఫలించింది. తడాఖా ఘన విజయం సాధించింది.
అక్కినేని కుటుంబం మూడు తరాల హీరోలు డా. అక్కినేని, నాగార్జున, నాగ చైతన్య..కలసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం మనం. ఈ చిత్రలో తాత అక్కినేని, తండ్రి నాగార్జునతో కలసి నటించి మెప్పించాడు..మరో విజయాన్ని సాధించాడు. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఒదిగిపోయి..ఏ పాత్ర అయినా చైతు చేయగలడని నిరూపించాడు. మనం ఆతర్వాత దేవ కట్టా దర్శకత్వంలో ఆటోనగర్ సూర్య సినిమాలో నటించాడు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. డైరెక్టర్ విజయకుమార్ కొండా దర్శకత్వంలో ఒక లైలా కోసం సినిమాలో నటించి మరోసారి రొమాంటిక్ మూవీతో సూపర్ సక్సెస్ సాధించాడు. ఆతర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ తో దోచేయ్ మూవీ చేసాడు కానీ తెరకెక్కించడంలో లోపం వలన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఏమాయ చేసావే సినిమాతో సక్సెస్ అందించిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రాన్నితెలుగులో కోన వెంకట్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సాహసం శ్వాసగా సాగిపో రెడీ అవుతుంది. అటు క్లాస్..ఇటు మాస్..ని మెప్పిస్తూ..గౌతమ్ మీనన్ తో కలసి మరో సంచలనం స్రుష్టించడానికి సాహసం శ్వాసగా సాగిపో అంటూ వస్తున్న నవ యువ సంచలనం నాగ చైతన్యకి ఆల్ ద బెస్ట్ తోపాటు బర్త్ డే విషెష్ చెబుతుంది ఇండియా గిల్ట్జ్.కామ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments