హ్యాపీ బ‌ర్త్ డే టు హీరో కార్తీ

  • IndiaGlitz, [Wednesday,May 25 2016]

మ‌ణిర‌త్నం ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించి..ఆత‌ర్వాత త‌మిళ్ లో ప‌రుత్తివీర‌న్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ క‌థానాయ‌కుడు కార్తీ. ప‌రుత్తివీర‌న్ త‌ర్వాత‌ అయరతిల్ ఒరువాన్, పయ్యా, నాన్ మహాన్ అల్లా, సిరుతై, బిరియాని త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి వ‌రుస విజ‌యాలు సాధించ‌డంతో అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. త‌మిళ్ లో న‌టించిన కార్తీ చిత్రాలు యుగానికి ఒక్క‌డు, ఆవారా, నా పేరు శివ టైటిల్స్ తో తెలుగులో రిలీజై ఇక్క‌డ కూడా ఘ‌న విజ‌యం సాధించాయి. అటు త‌మిళ్, ఇటు తెలుగు ఈ రెండు భాష‌ల్లో న‌టిస్తూ కార్తీ స‌క్సెస్ సాధిస్తుండ‌డం విశేషం.

న‌ట‌న పై భాష పై ప్రేమ‌

కార్తీ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అద్భుతంగా న‌టిస్తాడు అందుచేత తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా కార్తీని ఆద‌రిస్తున్నారు. అయితే కార్తీకి తెలుగులో ఆద‌ర‌ణ ల‌భించ‌డానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంది అని చెప్ప‌వ‌చ్చు. అది ఏమిటంటే.... కార్తీ త‌మిళయ‌న్ అయిన‌ప్ప‌టికీ తెలుగు నేర్చుకుని త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెబుతుండ‌డం...న‌ట‌న పైన తెలుగు భాష పైన‌ కార్తీకి ఎంత ప్రేమ ఉన్న‌దో చెప్ప‌క‌నే చెబుతుంది. ఆవారా, నా పేరు శివ చిత్రాల్లో కార్తీ న‌ట‌న చూస్తుంటే...అస‌లు న‌టిస్తున్నట్టు అనిపించ‌దు...అంత‌లా పాత్ర‌లో లీన‌మై న‌టిస్తాడు. అంతే కాదండోయ్...కార్తీని చూస్తుంటే..మ‌న ప‌క్కింటి అబ్బాయిని చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. అందుక‌నే తెలుగు ప్రేక్ష‌కులు కార్తీని ఆద‌రిస్తున్నార‌ని చెప్ప‌వ‌చ్చు.

తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసిన ఊపిరి...

టాలీవుడ్ కింగ్ నాగార్జున తో కార్తీ క‌లిసి న‌టించిన చిత్రం ఊపిరి. ఈ చిత్రంలో నాగార్జున కోటీశ్వ‌రుడైన విక్ర‌మాదిత్యగా న‌టించ‌గా కార్తీ విక్ర‌మాదిత్యకు కేర్ టేక‌ర్ గా శ్రీను పాత్ర‌లో న‌టించాడు. నిజం చెప్పాలంటే...ఊపిరి చిత్రంలో నాగార్జున కంటే ఎక్కువ పేరు కార్తీకే వ‌చ్చింది అని చెప్ప‌చ్చు. ఇదే విష‌యాన్ని నాగార్జున తో అంటే...ఈ సినిమాతో నాక‌న్నా కార్తీకి ఎక్కువ పేరు వ‌చ్చింది అంటే నాకు సంతోష‌మే..ఎందుకంటే కార్తీ నా త‌మ్ముడు క‌దా..ఈ సినిమాతో నాకు కార్తీ అనే త‌మ్ముడు దొరికాడు అని చెప్పారు. అలా చెప్ప‌డం...నాగార్జున గొప్ప‌త‌నం. ఓ మంచి చిత్రంతో తెలుగు లో స్ట్రైయిట్ మూవీ చేయాల‌నుకున్నాడు కార్తీ. దానికి త‌గ్గ‌ట్టు మంచి క‌థ ఎంచుకోవ‌డం...అంతే కాకుండా నాగార్జున‌తో క‌లిసి న‌టించ‌డంతో తెలుగులో కార్తీకి మరింత క్రేజ్ పెరిగింది.

మ‌ణిర‌త్నం తో కార్తీ..

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించిన కార్తీ...ఆత‌ర్వాత అనుకోకుండా హీరో అవ్వ‌డం...ఇప్పుడు త‌న గురువు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో కార్తీ హీరోగా న‌టిస్తుండ‌డం విశేషం. ఎప్ప‌టి నుంచో మ‌ణిర‌త్నం తో సినిమా చేయాల‌నుకుంటున్న కార్తీ క‌ల త్వ‌ర‌లో నెర‌వేర‌బోతుంది. ప్ర‌స్తుతం కార్తీ కాష్మోరా చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం త‌ర్వాత‌ ర‌జ‌నీకాంత్ తో క‌బాలి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తీ ఓ చిత్రం చేయ‌నున్నారు. అటు త‌మిళ్, ఇటు తెలుగు...ఈ రెండు భాష‌ల్లో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ విజ‌యాలు సాధిస్తున్న కార్తీ హ్యాపీ బ‌ర్త్ డే అండ్ ఆల్ ది బెస్ట్.