Hanuman:KGF రికార్డ్ దాటేసిన 'హనుమాన్'.. టాప్-10 సినిమాల్లో చోటు..

  • IndiaGlitz, [Tuesday,January 30 2024]

సంక్రాంతి పండుగ కానుకగా చిన్న సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'హనుమాన్' చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ప్రశాంత్ వర్మ మేకింగ్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఈ చిత్రంపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కసూల వర్షం కురిపిస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. మూవీ విడుదలై 20 రోజులు అవుతున్నా థియేటర్లన్ని హౌస్‌ ఫుల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అటు నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో ఆల్ టైమ్ టాప్-5 హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

ఇక ఉత్తరాదిలోనూ దుమ్మురేపుతోంది. రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్, యశ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్‌’ హిందీ వసూళ్లను బ్రేక్‌ చేసింది. రూ.50కోట్లకు దగ్గర్లో ఉంది. ఆదివారం నాటికి రూ.44.50 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 దక్షిణాది చిత్రాల జాబితాలో స్థానం సొంతం చేసుకుంది. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 2' సినిమా హిందీ వెర్షన్ అత్యధికంగా 512 కోట్ల వసూళ్లు రాబట్టి తొలి స్థానంలో ఉంది.

హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది డబ్బింగ్ సినిమాలు...

బాహుబలి - రూ. 512 కోట్లు
కేజీయఫ్ 2 - రూ. 434 కోట్లు
RRR - రూ. 277 కోట్లు
రోబో 2.0 - రూ. 199 కోట్లు
సలార్ - రూ. 154 కోట్లు
సాహో - రూ. 147 కోట్లు
బాహుబలి 1 - రూ. 119 కోట్లు
పుష్ప - రూ. 108 కోట్లు
కాంతారా - రూ. 79 కోట్లు
హనుమాన్ - రూ. 45 కోట్లు
కేజీయఫ్ 1 - రూ. 44 కోట్లు
కార్తికేయ 2 - రూ. 34 కోట్లు

హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 తెలుగు డబ్బింగ్ సినిమాలు..

బాహుబలి - రూ. 512 కోట్లు
RRR - రూ. 277 కోట్లు
సలార్ - రూ. 154 కోట్లు
సాహో - రూ. 147 కోట్లు
బాహుబలి 1 - రూ. 119 కోట్లు
పుష్ప - రూ. 108 కోట్లు
హనుమాన్ - రూ. 45 కోట్లు
కార్తికేయ2 - రూ. 34 కోట్లు
రాధేశ్యామ్ - రూ. 23 కోట్లు
లైగర్ - రూ. 21 కోట్లు

ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇచ్చిన విజయంతో దర్శకుడు త్వరలోనే ‘జై హనుమాన్‌’ను తెరకెక్కించనున్నారు. 'హనుమాన్‌' కన్నా 100 రెట్లు ఎక్కువగా ఈ చిత్రం ఉంటుందని చెప్పి అప్పుడే ప్రేక్షకల్లో ఆసక్తి నింపారు. దీంతో ఈ సినిమా విడుదల కోసం ఇప్పటి నుంచి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

More News

ఏపీలో 'కోడ్' రాక ముందే ఎలక్షన్ 'వార్'.. దద్దరిల్లుతున్న మైకులు..

షెడ్యూల్ విడుదల కాక ముందే ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పోటాపోటీగా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Telangana BJP:టార్గెట్ 10 ఎంపీ సీట్లు.. బస్సు యాత్రలకు తెలంగాణ బీజేపీ సిద్ధం..

మరో రెండు నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 10 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.

AP IPS Officers:ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యలో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు.

డ్రగ్స్‌తో పట్టుబడిన తెలుగు హీరో ప్రేయసి.. అరెస్ట్

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. పోలీసులు ఎంత హెచ్చరించినా కొంతమంది వినడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపారు.

Koratala Siva: కొరటాల శివకు షాక్.. క్రిమినల్ కేసు ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మరోసారి వార్తల్లో నిలిచారు. 'శ్రీమంతుడు' కథ విషయంలో ఏడేళ్లుగా జరుగుతున్న రచ్చ విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది.