Hanuman Vs Adipurush: 'హనుమాన్' వర్సెస్ 'ఆదిపురుష్'.. ప్రశాంత్‌ వర్మ దెబ్బకు ఓం రౌత్ అబ్బా..

  • IndiaGlitz, [Friday,January 12 2024]

టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తేజ సజ్జా హీరోగా ఆయన తెరకెక్కించిన 'హనుమాన్'(HanuMan) చిత్రం బ్లాక్‌బాస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. వాస్తవంగా ఇవాళ థియేటర్లలోకి విడుదలైనా.. నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్‌, నార్త్ ఇండియాలో కొన్ని చోట్లు ప్రీమియర్ షోలు వేశారు. దీంతో ముందుగానే సినిమా చూసిన ప్రేక్షకులు ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా సినిమాలోని గ్రాఫిక్స్, కెమెరా విజువల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. మైండ్‌బ్లోయింగ్‌గా ఉన్నాయని చెబుతున్నారు.

మూవీలోని చాలా సీన్స్‌లో గ్రాఫిక్స్ షాట్స్, వీఎఫ్‌క్స్ వాడారు. అయితే ఆ సీన్స్‌ చాలా నేచురల్‌గా ఉన్నాయని.. ఎక్కడా గ్రాఫిక్స్ అనే ఆలోచన కూడా రాదని కొనియాడుతున్నారు. కొన్ని సీన్స్ అయితే గూస్‌బంప్స్ తెప్పించాయంటున్నారు. ఆంజనేయస్వామి షాట్స్ అయితే నభూతో నభవిష్యతీ అని ప్రశంసిస్తున్నారు. కేవలం తక్కువ బడ్జెట్‌లో ఇటువంటి విజువల్ క్వాలిటీ సీన్స్ తీయడం శభాష్ అంటున్నారు. ఇంత నేచురల్‌గా సన్నివేశాలు డిజైన్ చేయడం మామూలు విషయం కాదని.. ప్రశాంత్ వర్మ టాలెంట్‌కు సెల్యూట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ని రాముడిగా చూపికంచిన తీరు.. గ్రాఫిక్స్ సీన్స్ అందరినీ నిరాశపరిచాయి. రామాయణ కథని చెడగొట్టడమే కాక.. రూ.600కోట్ల బడ్జెట్‌తో కార్టూన్ సీన్స్ తీశారని ట్రోల్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తీసిన ఆదిపురుష్ గ్రాఫిక్స్ కంటే.. చిన్న బడ్జెట్‌తో తీసిన హనుమాన్ గ్రాఫిక్స్ సీన్స్ 1000శాతం బెటర్ అని పోస్టులు పెడుతున్నారు. మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఓం రౌత్‌ను టార్గెట్‌ చేశారు. మొత్తానికి తెలుగువాడి సత్తా మరోసారి దేశవ్యాప్తంగా నిరూపితమైందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక హనుమాన్ సినిమా విషయానికొస్తే దేశవ్యాప్తంగా బ్లాక్‌బాస్టర్ టాక్ అందుకుని దూసుకుపోతోంది. సూపర్ హీరో సినిమా కాబట్టి పిల్లలకు బాగా నచ్చుతుంది. చివరి 15 నిమిషాలు థియేటర్లంతా జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగడం ఖాయం. సంక్రాంతి పండుగకి అసలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పవచ్చు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆస్వాదించే చిత్రం 'హనుమాన్' అని చెప్పుకోవచ్చు.