Hanuman:ZEE5లో సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘హను-మ్యాన్’ స్ట్రీమింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ‘హను-మ్యాన్’ను స్ట్రీమింగ్ చేస్తోంది. వెర్సటైల్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె.నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ‘హను-మ్యాన్’ చిత్రం ఎవరూ ఊహించని సక్సెస్‌ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవల్లో రూ.300 కోట్లను అందుకుంది. థియేటర్స్‌లో ‘హను-మ్యాన్’ సినిమాను ఎంజాయ్ చేసిన ఆడియెన్స్ ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూడసాగారు. అందరి వెయిటింగ్‌కు జీ5 ఇప్పుడు తెర దించేసింది. ఈ ఎగ్జయిటింగ్ చిత్రాన్ని ఆడియెన్స్‌కు అందిస్తోంది.
ప్రపంచంలోనే తొలి సూపర్ హీరో ఎవరంటే వెంటనే వినిపించే పేరు ‘హనుమాన్’. కానీ దైవశక్తిని ఎదిరించేలా తాను ఎదగాలని, ప్రజలందరూ తననే సూపర్ హీరోగా చూడాలని భావించిన ఓ వ్యక్తి (వినయ్ వర్మ).. కృత్రిమంగా శక్తిని సంపాదించుకునే పనుల్లో బిజీగా ఉంటాడు. అదే సమయంలో అంజనాద్రి ప్రాంతంలో ఉండే హనుమంతు (తేజ సజ్జ) అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. తల్లిదండ్రి లేని హనుమంతుని అక్క అంజనమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) అన్నీ తానై హనుమంతుని పెంచి పెద్దచేస్తుంది. ఆ ప్రాంతంలో అన్యాయం చేస్తోన్న గజపతిని ఓ సందర్భంలో హనుమంతు ఆ ఊళ్లో వైద్యం చేయటానికి వచ్చిన డాక్టర్ మీనాక్షి కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనాక్షిని హనుమంతు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంటాడు. గజపతి కారణంగా హనుమంతు ప్రమాదంలో చిక్కుకుంటే అతని ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓ అపూర్వశక్తి దొరుకుతుంది. దాంతో అతను ప్రజలకు మంచి చేస్తుంటాడు. చివరకు విషయం విలన్ వరకు చేరుతుంది. అపూర్వ దైవశక్తిని సంపాదించుకోవటానికి ప్రతినాయకుడు ఏం చేశాడు.. అతన్ని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. చివరకు ఆంజనేయస్వామి భక్తుడి కోసం ఏం చేశాడనే కథాంశంతో ‘హను-మ్యాన్’ తెరకెక్కింది.
పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ వసూళ్లను రాబట్టి రికార్డులను క్రియేట్ చేసిన ‘హను-మ్యాన్’..జీ 5లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయటానికి సిద్ధమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments