Hanuman:'హనుమాన్' మరో రికార్డ్.. 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

  • IndiaGlitz, [Tuesday,February 06 2024]

సంక్రాంతి పండుగ కానుకగా చిన్న సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'హనుమాన్' చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ప్రశాంత్ వర్మ మేకింగ్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఈ చిత్రంపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కసూల వర్షం కురిపిస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. మూవీ విడుదలై 25 రోజులు అవుతున్నా థియేటర్లన్ని హౌస్‌ ఫుల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

అటు నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో ఆల్ టైమ్ టాప్-5 హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక ఉత్తరాదిలోనూ దుమ్మురేపుతోంది. రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 దక్షిణాది చిత్రాల జాబితాలో స్థానం సొంతం చేసుకుంది. అలాగే ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో గత 92 ఏళ్లుగా ఏ సినిమా సాధించని రికార్డ్ హనుమాన్ సాధించింది. తాజాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఓ చిన్న సినిమా కేవలం 25 రోజుల్లోనే రూ.300కోట్ల వసూళ్లు చేయడం అంటే పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. మరోవైపు సంక్రాంతికి విడుదలైన సినిమాలు అప్పుడే ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వెంకీ మామ 'సైంధవ్' మూవీ ఇప్పటికే డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మహేష్ 'గుంటూరు కారం' మూవీ ఫిబ్రవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో, నాగార్జున 'నా సామిరంగ' చిత్రం ఫిబ్రవరి 15న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే 'హనుమాన్' ఓటీటీ స్ట్రీమింగ్‌కి మాత్రం మరింత సమయం పట్టనుంది. మార్చి 22న జీ5 ఓటీటీలోకి రానుందని సమాచారం.

ఇక ఈ సినిమాలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిశోర్‌, సముద్రఖని, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇచ్చిన విజయంతో దర్శకుడు ప్రశాంత్ త్వరలోనే ‘జై హనుమాన్‌’ను తెరకెక్కించనున్నారు. 'హనుమాన్‌' కన్నా 100 రెట్లు ఎక్కువగా ఈ చిత్రం ఉంటుందంటూ అప్పుడే ప్రేక్షకల్లో ఆసక్తి నింపారు. దీంతో ఈ సినిమా విడుదల కోసం ఇప్పటి నుంచే అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

More News

AP Assembly:హాట్‌హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ సభ్యులు సస్పెన్షన్..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా సాగాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలపడంతో వారిని సభాపతి తమ్మినేని సీతారాం

BRS:బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ..

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Rama Jogaiah: చంద్రబాబుకు అధికారం అప్పగించడమే మీ లక్ష్యమా..? పవన్‌కు జోగయ్య ఘాటు లేఖ..

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు రెండు నెలలు కూడా సమయం లేకపోవడంతో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి.

Balka Suman: రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదు.. బాల్క సుమన్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి రెచ్చిపోయారు.

Election Commission: ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగిస్తే కఠిన చర్యలు.. పార్టీలకు ఈసీ హెచ్చరిక..

త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనన్ను తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.