Hanuma Vihari: హనుమ విహారి వ్యవహారశైలి తొలి నుంచి వివాదస్పదమే.. ఏసీఏ ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
టీమిండియా క్రికెటర్ హనుమ విహారి విషయంలో పచ్చ నేతలు, పచ్చ మీడియా విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తమకు అనుకూలంగా వార్తలను వండి వార్చుతూ ప్రజలను మభ్య పెడుతున్నారు. క్రీడలకు రాజకీయాలు పులమి క్రీడాకారుల జీవితాలు నాశనం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. విహారి వ్యవహారంలోనూ ఇలాగే లేనిపోని కథనాలను ప్రచురిస్తూ.. ఆ బురదను అధికార వైసీపీపై చల్లాలని కుట్రలకు తెరదీస్తున్నారు. పచ్చ మీడియాకు తోడు
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ కూడా తోడై రాజకీయ కుట్రకు తెరదీశారు.
కానీ వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఈ మేరకు అంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. హనుమ విహారిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను తమ ప్రకటనకు జత చేసింది.
'సీనియర్ క్రికెటర్ హనుమ విహారి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, సహచర ఆటగాళ్లపై చేసిన ఆరోపణల నేపథ్యంలో కొన్ని రాజకీయపక్షాలు ఏసీఏ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడటం చూసి వాస్తవాలను తెలియజేయాలని ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాం. హనుమ విహారి ఏజ్ క్రికెట్ హైదరాబాద్ తరఫున ఆడారు.
2017లో తొలిసారి ఆంధ్రా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. 2020 సీజన్లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మళ్లీ ఆంధ్ర జట్టుకు తిరిగి వచ్చారు. ఆంధ్రాలో చేరినప్పటి నుంచి విహారి తనకు వస్తున్న ఆఫర్లు నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అడిగేవారు. కానీ విహారికి ఉన్న అనుభవం దృష్ట్యా జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఇక్కడే కొనసాగించింది. కెప్టెన్‌గా తననే కొనసాగించాలంటూ జట్టులోని ఆటగాళ్లు అంతా మద్దతు పలికినట్లు హనుమ విహరి షేర్ చేసిన లేఖ కూడా అవాస్తవం. తమను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నాడని పలువురు ఆటగాళ్లు మా దృష్టికి తీసుకొచ్చారు.
కేఎన్ పృథ్వీ రాజ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‌తో జట్టులోకి వచ్చాడని విహారి చేసిన ఆరోపణల్లోనూ వాస్తవం లేదు. పృథ్వీ రాజ్ రంజీ జట్టులో 17వ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అతను నేరుగా రంజీ టీమ్‌లోకి రాలేదు. అండర్ 14, 16 ఏజ్ గ్రూప్, అండర్-19, వినూ మన్కడ్, కూచ్ బెహార్, అండర్ 23, 25 కల్నల్ సి. కె. నాయుడు ట్రోఫీలో రాణించి ఆంధ్రా రంజీ టీమ్‌కు ఎంపికయ్యాడు.
ఈ సీజన్లో బెంగాల్‌తో తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా హనుమ విహారి.. కేఎన్ పృథ్వీ రాజ్‌ను ఆడించకుండా గాయపడ్డ మరో వికెట్ కీపర్‌ను ఆడించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా పృథ్వీ రాజ్‌ను విహారి అసభ్య పదజాలంతో దూషించాడు. దాంతో అతను అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా విహారి దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇక సెలెక్షన్ కమిటీ సిఫార్స్ మేరకే హనుమ విహారిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాం. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను బీసీసీఐకి అందజేస్తాం'అని ఏసీఏ తమ ప్రకటనలో పేర్కొంది.
హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఉన్నప్పటికి తొలి నుంచి అతని వ్యవహారశైలి వివాదాస్పదంగానే ఉందని తెలిపింది. సాటి క్రీడాకారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, పరుషంగా దూషించడం వంటి ఎన్నో ఫిర్యాదులు విహారిపై ఉన్నాయంది. ఈ ఘటనలపై జట్టులోని ఇతర క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై విచారణ చేశామని.. ఆరోపణలు వాస్తవం అని తేలడంతో అతనికి రాతపూర్వకంగా నోటీసులిచ్చామని స్పష్టం చేసింది. దానికి విహారి స్పందిస్తూ బోర్డు తీసుకునే నిర్ణయానికి కట్టుబడే ఉంటానని చెప్పాడని.. అందుకే అతడిపై బోర్డు చర్యలు తీసుకుందని క్లారిటీ ఇచ్చింది.
కానీ వాస్తవాలు తెలుసుకోకుండా దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని.. విహారిని కెప్టెన్‌గా తొలగించడంలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఎల్లోమీడియా విషపు కథనాలు ప్రచురించడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout