ఆ రోజునే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం వచ్చేసింది - హను రాఘవపూడి
- IndiaGlitz, [Wednesday,August 09 2017]
యూత్‌స్టార్ నితిన్ నటిస్తోన్న చిత్రం 'లై'. 'అందాల రాక్షసి', కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మేఘా ఆకాష్ హీరోయిన్గా వెంకట్ బోయిన్పల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. పతాకంపై టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'లై'. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా దర్శకుడు హనురాఘవపూడితో ఇంటర్వ్యూ...
ప్రేమ లేకుండా సినిమా లేదు...
'లై' సినిమా ప్రేమ ప్రధానంగా సాగే సినిమాయే. అయితే ఇందులో యాక్షన్ కూడా ఉంటుంది. నాకు తెలిసి లవ్ లేకుండా ఏ సినిమా కూడా ఉండదు. సినిమాను బట్టి స్పాన్ మారొచ్చు, లెవల్ మారొచ్చు అంతే.
ఎప్పటి నుండో నా మైండ్‌లో ఉంది...
విలన్ క్యారెక్టరైజేషన్ ఎప్పటి నుండో నా మైండ్‌లో ఉంది. సాధారణంగా విలన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను. అందాలరాక్షసి నుండి కృష్ణగాడివీరప్రేమగాథ మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్‌లో నాకు ఈ సినిమాకు సంబంధించిన ఐడియా వచ్చింది. నితిన్ ఎప్పటి నుండో నాతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆ సమయంలో ఈ కథను తనకు చెప్పాను. తనకు నచ్చడంతో చేయడానికి రెడీ అయ్యారు.
కథ డిమాండ్ మేరకే...
మన దేశంలోనే అద్భుతమైన లోకేషన్స్ ఉన్నాయి. కానీ కథ డిమాండ్ మేరకు సినిమాను అమెరికాలో షూటింగ్ చేశాం. ఈ కథకు తగ్గ లోకేషన్స్‌లో తీశాం. షాట్ మేకింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది.
కథకు తగ్గట్టే బడ్జెట్...
కథకు తగ్గట్లు, నితిన్ మార్కెట్ వేల్యూను అనుసరించే సినిమా మేకింగ్ చేశాం. అనీల్‌గారు ప్లానింగ్ అద్భుతం. రేపు సినిమాను తెరపై చూస్తే 70 కోట్ల సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. నిర్మాతలు నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. అది తెరపై కనపడుతుంది. ఇది రివేంజ్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు కానీ రివేంజ్ పార్ట్ ఉంటుంది.
అర్జున్‌గారి క్యారెక్టర్ గురించి...
అర్జున్‌గారంటే నాకెంతో ఇష్టం. ఆయన నటించిన సినిమాలన్నీ చూశాను. ఈ క్యారెక్టర్ అర్జున్‌గారి చేస్తే బావుంటుందని అనుకున్నాను. సుధాకర్‌రెడ్డిగారు ఓసందర్భంలో నన్ను ఆయనతో కలిపించారు. నేను భయపడుతూనే కథను ఆయనకు వినిపించాను. ఆయనకు నచ్చడంతో చేస్తానని అన్నారు.ఆయనలా అన్న రోజునే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం వచ్చేసింది. సినిమా డిసప్పాయింట్ చేయదు. అర్జున్‌గారి క్యారెక్టర్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఆయనలో అబ్సెషనే సినిమాలో యూనిక్‌గా ఉంటుంది. సినిమాకు సెంటర్‌పాయింట్.
ఎంజాయ్ చేస్తున్నాను...
దర్శకుడిగా నా జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. సినిమా హిట్ అయితే పొంగిపోవడం, ప్లాప్ అయితే కుంగిపోవడం తెలియదు. స్థిరత్వంతో ఉంటాను. అందుకు కారణం. నా స్నేహితులు. నా చుట్టు ఉన్న వాతావరణం.
తదుపరి చిత్రాలు...
నానితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాను. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా అది. లడక్‌లో సినిమా రన్ అవుతుంది. కాబట్టి వచ్చే మే వరకు షూటింగ్ చేయలేం. అలాగే నాని కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను.