ప్రేమ గురించి తెలియదంటున్న డైరెక్టర్..
Thursday, February 11, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమ గురించి తెలియదంటున్న డైరెక్టర్...ఎవరో కాదు హను రాఘవపూడి. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హను తొలి చిత్రానికే వైవిధ్యమైన ప్రేమ కథను ఎంచుకున్నాడు. ఈ సినిమా కొంత మందికి నచ్చింది. కొంత మందికి నచ్చలేదు. అది వేరే విషయం. ఇక హను తాజాగా తెరకెక్కించిన చిత్రం కూడా ప్రేమ కథా చిత్రమే. అదే కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. రెండు వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ హనుని అసలు ప్రేమకు మీరిచ్చే నిర్వచనం ఏమిటి అని అడిగితే మాత్రం...అసలు ప్రేమ గురించి ఏమీ తెలియదు. ప్రేమ ను నిర్వచించేంత వయసు నాకు లేదంటూనే...ప్రేమ అనే ఫీలింగ్ చెప్పడానికి భాషే లేదు. అదో తెలియని ఫీలింగ్ అంటున్నాడు. అదీ ప్రేమ గురించి హను మనసులోమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments