పెద్దల మాటే వింటానన్న హన్షు
Send us your feedback to audioarticles@vaarta.com
రూపాయి సంపాదిస్తే అందులో పైసా సమాజానికి పెట్టడానికి నేనెప్పుడూ వెనకాడను. సమాజం అంటే ఎక్కడో ఉండదు. నా చుట్టూ ఉన్న స్టాఫ్, వారి బంధువులు... ఇలా అవసరాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటే చాలనుకుంటాను అని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పారు హన్సిక. `దేశముదురు`తో తెలుగు సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన హన్షు ఇక్కడ చాలా సినిమాలు చేశాక కోలీవుడ్‌కి వెళ్లి, దాదాపు అక్కడే సెటిల్ అయ్యారు.
కమర్షియల్ హీరోయిన్గా మెప్పించిన ఆమె ఇప్పుడు మహా అనే సినిమాలో నటిస్తోంది. అంటే అది లేడీ ఓరియంటెడ్ సినిమాలో అన్నమాట. ఆ మధ్య శింబుతో ప్రేమను ట్విట్టర్ ద్వారా ప్రకటించి, అనంతర కాలంలోనే బ్రేకప్ను కూడా బాహాటంగానే చెప్పేశారు. ఇకపై తన పెళ్లి విషయాన్ని తన తల్లి చూసుకుంటారని, ఆమె ఏం చెప్తే దాన్నే వింటాననీ అంటున్నారు హన్సిక. ఇప్పటికే చాలా మంది పిల్లలను దత్తత తీసుకున్న హన్సిక ప్రస్తుతానికి ఆ పనులు కూడా నిలిపినట్టు చెప్పిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments