పిల్లలు కావాలంటున్న హన్షు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశముదురు పక్కన తెల్లటి బార్బీ బొమ్మలా కనిపించిన ఉత్తరాది చిన్నది హన్సిక. ఈ మధ్య కాలంలో తెలుగు కన్నా తమిళం మీదే ఎక్కువ దృష్టి పెట్టింది. తెలుగులోనూ అడపాదడపా సినిమాలను చేస్తూనే ఉంది. తాజాగా సుందర్ సి దర్శకత్వంలో అరణ్మణై 2 లో నటిస్తోంది. ఈ భామ మాట్లాడుతూ `` నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికే నా దగ్గర 31 మంది పిల్లలున్నారు. వారి ఆలనాపాలనా చూడటం, వారితో గడపడం చాలా నచ్చుతుంది. అందుకే ఎక్కడ ఏ మాత్రం తీరిక దొరికినా పిల్లల దగ్గరకు వెళ్తాను. ముంబైకి తరచూ వెళ్ళడానికి కారణం వారే. అలాగని సినిమాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయను. నా సినిమాల ద్వారా అభిమానుల మనస్సుల్లో శాశ్వత స్థానం కావాలన్నదే నా కోరిక`` అని చెప్పుకొచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments