పిల్లలు కావాలంటున్న హన్షు
- IndiaGlitz, [Tuesday,October 06 2015]
దేశముదురు పక్కన తెల్లటి బార్బీ బొమ్మలా కనిపించిన ఉత్తరాది చిన్నది హన్సిక. ఈ మధ్య కాలంలో తెలుగు కన్నా తమిళం మీదే ఎక్కువ దృష్టి పెట్టింది. తెలుగులోనూ అడపాదడపా సినిమాలను చేస్తూనే ఉంది. తాజాగా సుందర్ సి దర్శకత్వంలో అరణ్మణై 2 లో నటిస్తోంది. ఈ భామ మాట్లాడుతూ '' నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికే నా దగ్గర 31 మంది పిల్లలున్నారు. వారి ఆలనాపాలనా చూడటం, వారితో గడపడం చాలా నచ్చుతుంది. అందుకే ఎక్కడ ఏ మాత్రం తీరిక దొరికినా పిల్లల దగ్గరకు వెళ్తాను. ముంబైకి తరచూ వెళ్ళడానికి కారణం వారే. అలాగని సినిమాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయను. నా సినిమాల ద్వారా అభిమానుల మనస్సుల్లో శాశ్వత స్థానం కావాలన్నదే నా కోరిక'' అని చెప్పుకొచ్చింది.