అంతా ఓకె అంటున్న హన్సిక...
Send us your feedback to audioarticles@vaarta.com
దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక. ఆతర్వాత ఎన్టీఆర్, రామ్, విష్ణు, సిద్దార్థ..ఇలా యంగ్ హీరోలతో నటిస్తూ అలరిస్తుంది. అయితే ఇటీవల హన్సిక బ్లడ్ టెస్ట్ చేయించుకుందట. ఆ సమయంలో చాలా బాధ కలిగిందని...అప్పుడు తల్లి ఓదార్చిందని హన్సిక ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. స్వయంగా హన్సికనే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానని చెప్పడంతో హితులు, సన్నిహితులు..ఆరోగ్యం బాగోలేదా..అసలు ఏమి జరిగింది హన్సిక అంటూ చాలా మంది ఫోన్ లు చేసారట. అందరికీ జనరల్ చెకప్ మాత్రమే అని చెప్పిందట. అయినా ఇంకా ఫోన్ లు వస్తుండడంతో ఇక లాభం లేదనుకుని..తన ఆరోగ్యం గురించి కంగారు పడవలసిన అవసరం లేదని..జనరల్ చెకప్ మాత్రమే...అంతా బాగానే ఉందని మరో ట్వీట్ వేసింది ఈ అమ్మడు. అదీ సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com