తన పెళ్లిపై సెటైర్ వేసిన హన్సిక
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్స్ కాస్త సక్సెస్ అయిన తర్వాత కొన్నేళ్లు ఇండస్ట్రీలో రాణించిన తర్వాత వారికి రెగ్యులర్‌గా ఎదురయ్యే ప్రశ్న మీ పెళ్లెప్పుడు? కొన్నిసార్లు అయితే ఓ అడుగు ముందుకేసి సోషల్ మీడియానే సదరు హీరోయిన్ పెళ్లి పలానా వారితో అంటూ జరిపించేస్తుంటుంది కూడా. ఇప్పుడు హన్సిక విషయంలోనూ అలాంటి పరిస్థితే నెలకుంది. వివరాల్లోకెళ్తే హన్సిక త్వరలోనే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేయడం ప్రారంభమయ్యాయి. ఈ విషయం హన్సిక వరకు వెళ్లింది.
అయితే హన్సిక కోపగించుకోలేదు. సదరు వార్తలపై సెటెరికల్‌గా మాట్లాడుతూ తన పెళ్లిపై వస్తున్న వార్తలకు హన్సిక చెక్ పెట్టింది. ‘గాసిప్స్.. దేవుడా!.. ఇంతకు నా పెళ్లి కొడుకు ఎవరు? ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? నాకు కూడా ఇప్పుడే తెలిసింది ’ అంటూ ట్వీట్ చేశారు హన్సిక. ప్రస్తుతం హన్సికను తెలుగు, తమిళ చిత్రాల్లో గొప్పగా ఆఫర్స్ ఏమీ రావడం లేదు. గత ఏడాది సందీప్‌కిషన్‌తో ఈమె నటించిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ సినిమా విడుదలైంది. ప్రస్తుతం తమిళంలో మహా, పార్ట్నర్ చిత్రాలు మాత్రమే చేతిలో ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout