ఇండియన్ స్క్రీన్ పై సరికొత్త ప్రయోగానికి శ్రీకారం
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త ప్రయోగానికి టాలీవుడ్ శ్రీకారం చుట్టబోతోంది. సింగిల్ షాట్.. సింగిల్ క్యారెక్టర్.. వంటి వినూత్న ప్రయోగాలతో ఓ చిత్రం రూపొందబోతోంది. ‘105 మినిట్స్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. రుద్రాన్ష్ సెల్యులాయిడ్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోట్వాని ముఖ్య పాత్రలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇండియన్ స్క్రీన్‌పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో ఈ చిత్రం రూపొందబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి అన్నీ విశేషాలే కావడం గమనార్హం.
ఎడిటింగ్ లేకుండా లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథా కథనంలో చేస్తున్న సింగిల్ షాట్ చిత్రం కావడం మరో విశేషం. అలాగే రీల్ టైం అండ్ రియల్ టైం ఈ చిత్రానికి హైలైట్స్‌గా నిలవనున్నాయి. దర్శకుడు రాజు దుస్సా దర్శకత్వంలో ‘105 మినిట్స్’ సినిమా తెరకెక్కబోతోంది. ‘సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్, రీల్ టైం అండ్ రియల్ టైం’ ఈ చిత్రానికి హైలైట్స్ అని మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంలో హన్సిక మోట్వాని ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనపడబోతోందని రాజు దుస్సా తెలిపారు.
అలాగే చిత్ర కథానాయిక హన్సిక మోట్వాని మాట్లాడుతూ.. ఈ చిత్రం తన కెరీర్‌లోనే ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని వెల్లడించింది. సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ ఈ సినిమా మేకింగ్ తనకు ఒక ఛాలెంజ్ అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత బొమ్మక్ శివ మాట్లాడుతూ.. ఇలాంటి చిత్రాన్ని తన బ్యానర్‌లో నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్ర నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని బొమ్మక్ శివ వివరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments