వాటినే నమ్ముకున్న హన్సిక
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో కాస్త జోరు తగ్గించినా.. తమిళంలో మాత్రం బాణంలా దూసుకుపోతోంది అందాల తార హన్సిక. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు తమిళ సినిమాలతో పలకరించిన హన్సు.. ఈ ఏప్రిల్‌లో ఏకంగా రెండు సినిమాలతో సందడి చేయనుంది. విశేషమేమిటంటే.. అవి రెండు కూడా రీమేక్ చిత్రాలు కావడం.
ఏప్రిల్ 1న విడుదల కానున్నతమిళ చిత్రం 'ఉయిరే.. ఉయిరే' తెలుగులో విజయం సాధించిన 'ఇష్క్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కితే.. ఏప్రిల్ 29న రానున్న మరో తమిళ చిత్రం 'మణిదన్' హిందీలో విజయం సాధించిన 'జాలీ ఎల్.ఎల్.బి'కి రీమేక్. తన గత చిత్రం 'పోకిరి రాజా' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో ఈ రీమేక్‌ల ఫలితాలనే నమ్ముకుంది హన్సిక. మరి ఆమె నమ్మకాన్ని తెలుగు, హిందీ హిట్ చిత్రాల రీమేక్‌లు ఏ మాత్రం నిలబెడతాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com