డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న హన్సిక
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత, తమన్నా సహా పలువురు స్టార్స్, టెక్నీషియన్స్ డిజిటల్ రంగం వైపు అడుగులేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్కు సమాంతరంగా ఎదుగుతున్న డిజిటల్ రంగం వైపు అందరూ కొత్త తరహా పాత్రలను చేయడానికి నటీనటులు ఆసక్తి చూపుతుంటే..తాము చెప్పాలనుకున్న కాన్సెప్ట్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించడానికి టెక్నీషియన్స్ ట్రై చేస్తున్నారు. ఇలాంటి డిజిటల్ రంగం వైపు మరో హీరోయిన్ కూడా అడుగులేశారు. ఆమె ఎవరో కాదు హన్సిక మొత్వాని. ఈ చబ్బీ బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందబోయే ఓ వెబ్ సిరీస్‌లో నటించింది.
ముంబై బ్యాక్‌డ్రాప్‌లో పది ఎపిసోడ్స్ యూత్‌పుల్ కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసింది ఎవరో కాదు... పిల్లజమీందార్, భాగమతి చిత్రాల దర్శకుడు అశోక్. నిషా అనే పేరుతో ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో జనవరి నుండి ప్రసారం అవుతుంది. ఒకప్పుడు హీరోయిన్గా బిజీగా ఉంటూ తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేసిన హన్సికకు పెద్దగా అవకాశం రావడం లేదు. ప్రస్తుతం ఆమె యాబైవ సినిమాగా ‘మహా’ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా తర్వాత మరో సినిమా చేతిలో లేకపోవడంతో.. వెబ్ సిరీస్‌లో నటించడానికి హన్సిక ఆసక్తి చూపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout