హన్సిక ఫాంటసీ మూవీ
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాట హన్సిక హవా మాములుగా లేదు. సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా అవకాశాలను అందిపుచ్చుకుంటోందీ బొద్దుగుమ్మ. నిన్నటికి నిన్న 'పులి' అనే జానపద చిత్రంలో యువరాణిగా సందడి చేసిన హన్సిక.. తాజాగా ఓ సోషియో ఫాంటసీ సినిమాలో అవకాశం చేజిక్కించుకుంది.
జీవా హీరోగా 'పోక్కిరి రాజా' పేరుతో తెరకెక్కుతున్న సదరు ఫాంటసీ మూవీ ఆద్యంతం వినోదభరితంగా ఉంటుందని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో హన్సిక లుక్, క్యారెక్టర్ కొత్తగా ఉంటాయని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments