హ‌న్సిక ఫాంట‌సీ మూవీ

  • IndiaGlitz, [Tuesday,November 03 2015]

త‌మిళ‌నాట హ‌న్సిక హ‌వా మాములుగా లేదు. స‌క్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటోందీ బొద్దుగుమ్మ‌. నిన్న‌టికి నిన్న 'పులి' అనే జాన‌ప‌ద చిత్రంలో యువ‌రాణిగా సంద‌డి చేసిన హ‌న్సిక‌.. తాజాగా ఓ సోషియో ఫాంట‌సీ సినిమాలో అవకాశం చేజిక్కించుకుంది.

జీవా హీరోగా 'పోక్కిరి రాజా' పేరుతో తెర‌కెక్కుతున్న స‌ద‌రు ఫాంట‌సీ మూవీ ఆద్యంతం వినోద‌భ‌రితంగా ఉంటుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో హ‌న్సిక లుక్‌, క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉంటాయ‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.