హన్సిక అలా సరిపెడుతోంది
Send us your feedback to audioarticles@vaarta.com
2007లో విడుదలైన 'దేశముదురు'తో హీరోయిన్గా తన ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టింది హన్సిక. ఆ తరువాత ప్రతి ఏడాదిలోనూ కనీసం ఓ తెలుగు సినిమాతోనైనా తన ఉనికిని చాటుకున్న హన్సిక.. ఈ ఏడాది మాత్రం హీరోయిన్గా ఒక్క సినిమాని కూడా చేయలేదు. అయితే.. ఆ లోటుని అతిథి పాత్రతో కవర్ చేసేందుకు ట్రై చేస్తోందీ అమ్మడు. అనుష్క నటించిన 'సైజ్ జీరో' కోసం హన్సిక ఓ గెస్ట్ రోల్ చేసింది. ఆ పాత్ర రూపంలో తెలుగువారిని మరోసారి పలకరించబోతోంది హన్సిక. హీరోయిన్గా చేయకపోయినా.. ఇలా స్పెషల్ అప్పీరియన్స్‌తో తన లెక్కని సరిపెడుతోంది హన్సిక. 'సైజ్ జీరో' ఈ నెల 27న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments