తన తో సేమ్ సీజన్ లో వస్తున్న హన్సిక
Send us your feedback to audioarticles@vaarta.com
పాలబుగ్గల సుందరి హన్సికకి అచ్చొచ్చిన డైరెక్టర్‌గా సుందర్.సికి మంచి పేరుంది. 'తీయా వేలై సెయ్యనుం కుమారా' (తెలుగులో 'సమ్‌థింగ్ సమ్‌థింగ్'), 'అరణ్‌మణై' (చంద్రకళ) చిత్రాలతో ఈ ఇద్దరి కాంబినేషన్ మంచి విజయాలను సొంతం చేసుకుంది.
వీరి కలయికలో వచ్చిన మూడో సినిమా 'అంబాలా' (తెలుగులో 'మగమహారాజు') ఆశించిన విజయం సాధించకపోయినా.. ఫరవాలేదనిపించుకుంది. మళ్లీ ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్న చిత్రం 'అరణ్ మణై 2'. 'అరణ్‌మణై'కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. సిద్ధార్థ్, త్రిష కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. విశేషమేమిటంటే.. 'అంబాలా' రిలీజైన సంక్రాంతి సీజన్‌లోనే 'అరణ్‌మణై 2' కూడా రానుంది. మరి 'అంబాలా'కి అంతగా అచ్చిరాని సంక్రాంతి 'అరణ్‌మణై 2'కి కలిసొస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments