ర‌క్త‌పు స్నానం చేస్తున్న హ‌న్సిక‌

  • IndiaGlitz, [Tuesday,January 01 2019]

పాల బుగ్గ‌ల సొగ‌స‌రి హ‌న్సిక ఇప్పుడు త‌న 50వ సినిమా 'మ‌హా'లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్‌ను నేడు కొత్త సంవత్స‌రం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన త‌ర్వాత ప‌లు వివాదాల‌కు కూడా కార‌ణ‌మైంది. ఇప్పుడు విడుద‌ల చేసిన లుక్ సినిమా హార‌ర్ కంటెంట్ చుట్టూనే తిరుగుతుంద‌ని తెలుస్తుంది. ర‌క్తంతో నిండి ఉన్న బాత్ ట‌బ్‌లో హ‌న్సిక ప‌డుకుని ఉంది. ఒక చేతితో సైలెన్స్ అని చెబుతుంది..

మ‌రో చేతిలో గ‌న్ ప‌ట్టుకుని ఉంది. యు.ఆర్‌.జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌తియల‌గ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా... జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.