'హల్ చల్' టీజర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శక నిర్మాతలు
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నూతన నిర్మాత గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న చిత్రం 'హల్ చల్'. శ్రీపతి కర్రి దర్శకుడు. రుద్రాక్ష హీరో గా, ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ను శుక్రవారం రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్, రఘు కుంచె, క్రాంతి మాధవ్ ల చేతుల మీదుగా విడుదల చేయించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. ప్రతి డైరెక్టర్ కు ఓ విజన్ ఉంటుంది. ఆ విజన్ ను చూపించడానికి ఒక మంచి టీమ్ కావాలి.. అలాంటి టీమ్ నాకు ఈ చిత్రం ద్వారా దొరికింది. వెరీ న్యూ కాన్సెప్ట్. హల్ చల్ అనే డ్రగ్ బ్లెండర్ స్టోరీ.. అలా అని కేవలం డ్రగ్స్ కు సంబందించిన అంశాలే ఉండవు, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్, లవ్ ఇలా అన్నీ ఉంటాయి ఈ చిత్రంలో.. హీరో రుద్రాక్ష ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనే అతన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. హీరోయిన్ ధన్య చాలా బాగా నటించింది. ఇక నిర్మాత గణేష్ గారు అయితే కథ చెప్పగానే నచ్చి నాపై ఈ భాద్యను పెట్టారు. . కొత్త నిర్మాత అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సపోర్ట్ చేశారు. హనుమాన్ అందించిన ఈ చిత్ర మ్యూజిక్ ప్రతి చోటా వినపడుతోంది అంతబాగా అందించారు. సినిమా కాన్సెప్ట్ కూడా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని భావిస్తున్నా అన్నారు.
నిర్మాత గణేష్ కొల్లూరి మాట్లాడుతూ.. ఈ టీజర్ ను విడుదల చేయడానికి విచ్చేసిన అథితులందరికీ నా కృతజ్ఞతలు. కొత్త నిర్మాతను కూడా ప్రోత్సహిస్తారని ఈ ఫంక్షన్ కు విచ్చేసిన అథితులను చూస్తే అర్థం అయ్యింది. షూటింగ్ పూర్తి చేసాము.. కొత్తగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు అని కాకుండా దర్శకుడు శ్రీపతి చెప్పిన కథను చెప్పినట్టుగానే తీసాడు. నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఇక ఈ చిత్రంలోని మ్యూజిక్ వింటుంటే కీరవాణి గారు గుర్తుకు వస్తారు. అంత అద్భుతంగా ఇచ్చాడు హనుమాన్. ఇందులో నటించిన నటీనటులు అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. చెప్పాలంటే అందరి సమిష్టి కృషి వల్లే ఈ హల్ చల్ మూవీ ఇక్కడి దాకా వచ్చింది. త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.. అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాము అని తెలిపారు.
హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలు పెట్టిన నన్ను ఈ చిత్రంలో లీడ్ రోల్ హీరోయిన్ గా తీసుకోవాలని పట్టు పట్టి మరీ తీసుకున్న దర్శక నిర్మాతలకు నా కృతఙ్ఞతలు. హల్ చల్ కథ వినగానే ఒకే చేసాను.. కొత్త కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక హీరో రుద్రాక్ష్ 14 ఏళ్ళు వనవాసం చేసి మరీ హీరో అయ్యారు ఈ సినిమాతో.. చాలా బాగా నటించాడు.. కోపరేటివ్ పెర్సన్ కూడా.. టీమ్ అందరూ కూడా ఎంతో ఎఫర్ట్ పెట్టి పనిచేశారు.. తప్పకుండా సక్సెస్ అవుతుందని అన్నారు.
హీరో రుద్రాక్ష్ మాట్లాడుతూ.. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. మొదట చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలు పెట్టాను. తరువాత విలన్ పాత్రలు వేసాను. 16 ఏళ్ల కష్టం తరువాత హీరో అవ్వాలనే నా కోరిక ఈ సినిమాతో నెరవేరింది. అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. సత్య ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చాడు. డిఫరెంట్ స్టోరీ. నచ్చుతుందని ఆసుస్తున్నా.. అలానే సినిమానే నా ప్రాణంగా భావిస్తాను.. కనుక ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ కృతఙ్ఞతలు అని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments