హారర్ సినిమాను తలపిస్తున్న హాజీపూర్ హత్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం హాజీపూర్‌లో భయానక వాతావరణం నెలకొంది. శ్రావణిపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ విచారించగా షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత మూడ్రోజులుగా హాజీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. శ్రావణి హత్యకేసు ఉదంతం మరువకముందే మంగళవారం మరో అమ్మాయి మృతదేహం బావిలో పోలీసులు గుర్తించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నెలరోజుల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయిన మనీషా అనే డిగ్రీ విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని బావిలోంచి తీశారు. ఈ విషయం తెలుసుకున్న మనీషా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో మరోసారి హాజీపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పెల్లుబికిన ఆగ్రహం..
శ్రావణి, మనీషా ఇద్దరి హత్యకు శ్రీనివాసరెడ్డి కారణమని తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెచ్చుకోవడంతో శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడిచేసి నిప్పటించారు. దాదాపు ఇళ్లు మొత్తం మంటల్లో కాలిపోయింది. అప్పటికే శ్రీనివాస్ కుటుంబీకులు గ్రామం నుంచి పరారయ్యారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ అనితా రామచంద్రన్ పాడుబడ్డ బావులను పూడ్చి వేయడమే కాకుండా.. హాజీపూర్‌కు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్థులను అడ్డుకుని నచ్చజెప్పి పంపుతున్నారు.
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..
పోలీసుల అదుపులో ఉన్న శ్రీనివాసరెడ్డిని పోలీసులు విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడించాడు. కల్పన, శ్రావణి, మనీషా ముగ్గుర్నీ అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిందితుడు శ్రీనివాస్ వెల్లడించినట్లు రాచకొండ సీపీ మోహన్ భగవత్ మీడియాకు వివరించారు. అయితే ఈ ముగ్గుర్నే కాదు అంతకముందు కూడా పలు ఘటనలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. 2015లో మైసిరెడ్డిపల్లిలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి గ్రామస్థుల శ్రీనివాస దెబ్బలు తిన్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. అంతేకాదు బెంగళూరులోని ఓ ఏటీఎం సెంటర్లో ఓ మహిళ బ్యాగ్ లాగడంతో ఆమె ప్రతిఘటించిందని కత్తితో దాడి చేసి పరారయ్యాడని విచారణలో తేలింది. కర్నూలు జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు గతంలో కేసు నమోదైందని తేలింది. 2015లో కల్పన అనే పదకొండేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసి బావిలో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నాడు.
నెలన్నర కింద డిగ్రీ విద్యార్థిని మనీషాను అత్యాచారం చేసి హత్య చేసి అదే బావిలో పాతి పెట్టినట్లు కూడా ఒప్పుకున్నాడు. చివరికి ఈ నెల 25న స్కూల్‌కి వెళ్లి వస్తున్న శ్రావణిని అత్యాచారం చేసి హత్య చేసి అదే బావిలో శవాన్ని పడేశానని పోలీసుల విచారణలో నిగ్గు తేలింది. ఈ విషయం మీడియాలో చూసి తెలుసుకున్న గ్రామస్తులు మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout