హాజీపూర్ హత్యల కేసు: శ్రీనివాస్‌కు ఉరి శిక్ష
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన.. ఊహించుకోవడానికే భయపడేలా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం హాజీపూర్‌లో శ్రీనివాసరెడ్డి వరుస అత్యాచార ఘటనలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి.. న్యాయ స్థానంలో దోషిగా నిలబెట్టారు. కొన్నిరోజులుగా ఈ కేసును విచారించిన నల్గొండ న్యాయస్థానం గురువారం నాడు శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.
పాపం పండింది!
శ్రావణి కేసులో బలమైన ఆధారాలు సేకరించిన పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు.. పక్కా ఆధారాలు సేకరించి, పకడ్బందీగా విచారణ పూర్తిచేశారు. కేవలం ఘటన వెలుగులోకి వచ్చిన 90 రోజుల్లో విచారణ పూర్తి చేశారు. కాగా రెండు కేసుల్లో ఉరిశిక్ష విధించిన కోర్టు.. ఎఫ్ఐఆర్-109,110 కేసుల్లో ఉరిశిక్ష విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. శ్రావణి కేసులో ఉరిశిక్ష, మనీషా కేసులో జీవితఖైదు విధించింది. కల్పన కేసులో నిందితుడికి జడ్జి ఎస్వీ. వినాథ్ రెడ్డి ఉరిశిక్ష విధించారు.
సర్వత్రా హర్షం!
కేసులో మొత్తం 101 మంది సాక్ష్యులను కోర్టు సుధీర్ఘంగా విచారించింది. మొత్తం మూడు ఘటనల్లో శ్రీనివాసరెడ్డిని కోర్టు దోషిగా తేల్చింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్యల కేసులో ఈ కామాంధుడి పాపం పండిందని.. కోర్టు తీర్పు పట్ల బాధిత కుటుంబాలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇది వరకే..!
కాగా.. సమత హత్యోదంతం కేసులో నిందితులకు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. షేక్‌బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూంలను దోషులుగా నిర్ధారిస్తూ ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. గత నవంబర్ 24న కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామం సమీపంలో సమతపై నిందితులుసామూహిక హత్యాచారానికి పాల్పడి కత్తితో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హేయమైన ఘటనపై ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టి ఉరిశిక్ష విధించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com