మహేశ్‌ను.. ‘ఒరేయ్’ అనడానికి చాలా ఇబ్బంది పడ్డా...!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన తాజా చిత్రం ‘మహర్షి’. మే-09న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. కేవలం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాలో లాంగ్ గ్యాప్ తర్వాత అల్లరి నరేశ్ ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ‘మహర్షి’ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో ముఖ్య పాత్రలో నటించిన నరేశ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన ఈ సినిమాను ఎప్పటికీ మరిచిపోలేనని.. తన తండ్రి ఉండుంటే చాలా ఆనందపడేవారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదే ఇంటర్వ్యూలోనే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
చాలా ఇబ్బంది పడ్డా..!
"ఈ సినిమాలో నేను మహేశ్ స్నేహితుడిగా కనిపిస్తాను. అందువలన ఆయన నన్ను ఒకటి.. రెండుసార్లు 'ఒరేయ్' అని పిలుస్తాడు. కానీ నేను మాత్రం ఆయనను 'ఒరేయ్' అని టోటల్‌గా నేనైతే 100 సార్లు పైగా ‘ఒరేయ్.. ఒరేయ్’ అని పిలవాల్సి వచ్చింది. అలా పిలవడం నాకు చాలా ఇబ్బందిని కలిగించింది. ఆ విషయాన్ని వంశీ పైడిపల్లితో కూడా చెప్పాను. స్నేహితులు అలాగే పిలుచుకుంటారనీ.. మహేశ్ ఏమీ అనుకోరని ఆయన చెప్పారు. ఈ సినిమాతో మహేశ్ మంచి మనసును దగ్గరగా చూడగలిగాను. నేను హీరో.. అన్నీ నాకే ఉండాలి అని ఆయన ఎప్పుడూ అనుకోరు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారని అనిపించింది" అని నరేశ్ ఒకింత ఆవేదనతో చెప్పారు.
కాగా.. ఇక ‘మహర్షి’ చిత్రంలో అల్లరి నరేష్ చేసిన రవి పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. పల్లెటూరి యువకుడిగా ఊరికోసం తపన పడే పాత్రకు జీవం పోశారని చెప్పుకోవచ్చు. ‘మహర్షి’ కథ మొత్తం నరేష్ పాత్ర చుట్టూనే డిజైన్ చేయడం.. ఆ పాత్రకు నరేష్ వందశాతం న్యాయం చేశాడని ఆయన అభిమానులు, సినీ ప్రియులు, మహేశ్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com