ఆసక్తిని రేకెత్తిస్తున్న మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ SSMB28 చిత్రం వివరాలు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం రూపొందనుందని ప్రకటన వచ్చిన నాటినుంచి చిత్రం పై ఉత్సుకత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షక వర్గాల్లోనూ నానాటికీ పెరుగుతూ వస్తోంది. దీనిని కొనసాగిస్తూ...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం ను విడుదల చేసారు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘ చిత్రం యూనిట్. ఈ ప్రచార చిత్రాన్ని వీక్షిస్తే... జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి ఎంపిక అయ్యారు. అలాగే కళా దర్శకునిగా అశోక్, ఛాయాగ్రాహకుడు గా ‘మధీ‘, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక  సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార ‘ పూజాహెగ్డే‘ మరోసారి జతకడుతున్నారు. చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత  ఈ సందర్భంగా తెలిపారు. 

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న ఈ  భారీ చిత్రం, మ‌హేష్-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి. ప్రసాద్ ఒక స్పెష‌ల్ క్రేజ్ ఉన్న #SSMB28కి స‌మ‌ర్ప‌ణ: శ్రీ‌మ‌తి మ‌మ‌త‌, నిర్మాత‌: సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు), ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌.

More News

శ‌రణ్ కుమార్ కొత్త చిత్రం.. హీరో లుక్‌ పోస్టర్‌ను ఆవిష్క‌రించిన సూప‌ర్‌స్టార్ కృష్ణ

సూపర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్న సినిమాలో హీరో లుక్ పోస్ట‌ర్‌ను ఆదివారం సూప‌ర్‌స్టార్ కృష్ణ విడుద‌ల చేశారు.

'SR కళ్యాణమండపం' మ్యూజికల్ హిట్ అవడం సంతోషంగా ఉంది - చేతన్ భరద్వాజ్

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఆ పేరు వినగానే "RX 100" చిత్రం లోని పిల్లారా సాంగ్ గుర్తుకు వస్తుంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న హన్సిక '105 మినిట్స్'

ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం "105 మినిట్స్".

BRO చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన రష్మిక మందన

ఎన్నో హిట్ సినిమాలలో నటించిన హీరో,హీరోయిన్ లు ఈ మధ్య కథకు  ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఆది సాయికుమార్ 'బ్లాక్' టీజ‌ర్ విడుద‌ల‌

మ‌హంకాళీ మూవీస్ బ్యాన‌ర్ పై మ‌హంకాళీ దివాక‌ర్ నిర్మాత‌గా మ్యాచో హీరో ఆది సాయికుమార్,