Gyanvapi: జ్ఞానవాపి కేసులో కీలక పరిణామం.. మసీదులో పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి..
Send us your feedback to audioarticles@vaarta.com
జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదు ప్రాంగణలో సీల్ చేసి ఉన్న బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది. వారం రోజుల్లో పూజలకు సంబంధించిన ఏర్పా్ట్లను పూర్తి చేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హిందువుల తరపున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదించగా.. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాది అఖ్లాక్ అహ్మద్ వాదించారు.
భారత పురావస్తు విభాగం(ASI) చేసిన సర్వేలో కీలక విషయాలు బయటపడినట్లు విష్ణు శంకర్ జైన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలున్నట్లు సర్వే నివేదిక పేర్కొందని వెల్లడించారు. మసీదు లోపల పూజలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టంచేశారు. ఆయన వాదనలపై సానుకూలంగా స్పందించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేస్తామని ఇంతేజామియా మసీదు కమిటీ తెలిపింది. మరోవైపు కోర్టు తీర్పుపై స్పందించిన కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ సంతోషం వ్యక్తం చేసింది. హిందువులకు అతి పెద్ద విజయమని పేర్కొంది. వారం రోజుల్లో మసీదు ప్రాంగణంలో శివుడికి పూజలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
కాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి ప్రార్థనా మందిరం విషయంలో కొన్నేళ్లుగా పోరాటం జరుగుతుంది. ఈ క్రమంలోనే మసీదు ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులకు పూజలు చేసేందుకు అనుమతివ్వాలంటూ కొంతమంది మహిళలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది.
కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే నిర్వహించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో భారీ హిందూ ఆలయం ఉండేదని తేల్చింది. ఆ ఆలయాన్ని వాటి శిథిలాలతోనే మసీదు నిర్మించారని నివేదిక బయటపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, సర్వే నివేదికతో మసీద్ బేస్‌మెంట్ సీల్ వేశారు. ఈ సర్వే నేపథ్యంలో తాజాగా హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి లభించింది. దీంతో బేస్‌మెంట్ బారికేడ్లు తెరుచుకోనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments