చైతు పాత్రలో జీవీ ప్రకాష్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు హీరోగా మరో సినిమా చేయడానికి జీవీ ప్రకాష్ సిద్ధమయయాడు. చైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 100%లవ్ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారట. ఇందులోచైతన్య పాత్రలో జీవీ ప్రకాష్ నటిస్తున్నాడట. మరి హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియరాలేదు.
అయితే ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రాన్ని తమిళంలో సుకుమార్ నిర్మించనున్నాడట. తెలుగులో దర్శకత్వంతో పాటు నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ కొత్తగా తమిళ సినీ రంగంలోకి మాత్రం నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాడట. ఈ విషయాన్ని జీవి ప్రకాష్ స్వయంగా తెలియజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments