బిగ్ ఫ్యామిలీ హీరో చెల్లెలు హీరోయిన్‌గా తెరంగేట్రం
- IndiaGlitz, [Tuesday,June 11 2019]
బిగ్ ఫ్యామిలీస్ నుంచి హీరోయిన్ల రాక నెమ్మదిగా మొదలైంది. తెలుగులో లక్ష్మీ మంచు, తమిళంలో శరత్‌కుమార్ తనయ వరలక్ష్మీ శరత్‌కుమార్, అంతకు ముందే లక్ష్మి కుమార్తె ఐశ్వర్య ఇలా పలువురు నిదానంగా వెండితెరకు అరంగేట్రం చేస్తున్నారు.
తాజాగా జీవీ ప్రకాష్ చెల్లెలు, రెహమాన్ మేనకోడలు నటిగా తెరంగేట్రం చేస్తోంది. భవానీ శ్రీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నది విజయ్ సేతుపతి చిత్రంతో. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మరో నాయికగా నటిస్తోంది. అటు విజయ్ సేతుపతికి, ఇటు ఐశ్వర్య రాజేష్‌కు తెలుగులో మంచి ఆదరణ ఉండటంతో ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయినా భవానికి కెమెరాను ఫేస్ చేయడం ఇదేం కొత్తకాదు. ఆల్రెడీ ఆమె అక్కినేని కోడలు అమల నటిస్తున్న హై ప్రీస్టస్ అనే వెబ్‌సీరీస్‌లో నటిస్తున్నారు.
తాజా చిత్రానికి జిబ్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పి.కె. విరుమాండి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటోంది.