నీ జతలేక చిత్రానికి అన్ని చోట్ల అద్భుతమైన స్పందన - నిర్మాతలు జి.వి.చౌదరి, నాగరాజ్ గౌడ్ చిర్రా

  • IndiaGlitz, [Saturday,October 01 2016]

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా, పారుల్‌, సరయు హీరోయిన్లుగా సత్య విదుర మూవీస్‌ పతాకంపై లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజ్‌ గౌడ్‌ చిర్రా నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'నీ జతలేక'. ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు జి.వి.చౌదరి, నాగరాజ్‌గౌడ్‌ చిర్రా మాట్లాడుతూ - ''మా సినిమాకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చక్కని ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. విడుదలైన అన్ని సెంటర్స్‌లో మంచి ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్ర కథ, కథనాలు ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నాయి. హీరో నాగశౌర్య, హీరోయిన్లు పారుల్‌, సరయుల పెర్‌ఫార్మెన్స్‌ బాగుందని ప్రశంసిస్తున్నారు. అలాగే డైరెక్టర్‌ లారెన్స్‌ దాసరికి దర్శకుడుగా మంచి పేరు వచ్చింది. సినిమాలో వున్న అన్ని రకాల ఎమోషన్స్‌కి ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మా సత్య విదుర మూవీస్‌ బేనర్‌లో ఇలాంటి చక్కని ప్రేమ కథా చిత్రాన్ని నిర్మించడం, ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఎలాంటి అశ్లీలత లేని క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మా 'నీ జతలేక' చిత్రాన్ని మరింతగా ఆదరించి ఘనవిజయాన్ని అందిస్తారని, ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని తీసే ఉత్సాహాన్ని ఆడియన్స్‌ ఇస్తారని ఆశిస్తున్నాము'' అన్నారు.
దర్శకుడు లారెన్స్‌ దాసరి మాట్లాడుతూ ''సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రజెంట్‌ యూత్‌కి సంబంధించిన ఒక మంచి పాయింట్‌ని తీసుకొని చేసిన ఈ సినిమా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అవుతోంది. సినిమా రిలీజ్‌కి ముందే పాటలు హిట్‌ అయ్యాయి. సినిమాలో పాటలు చాలా బాగున్నాయని సినిమా చూసిన ఆడియన్స్‌ ప్రశంసిస్తున్నారు. స్వరాజ్‌ అందించిన పాటలు, కరుణాకర్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి చాలా ప్లస్‌ అయ్యాయి. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమాను మా నిర్మాతలు ఎంతో నమ్మకంతో నిర్మించారు. ఇప్పుడు సినిమాకి మంచి ఓపెనింగ్స్‌తో అన్నిచోట్ల నుంచి పాజిటివ్‌ రిపోర్ట్స్‌ రావడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు.
నాగశౌర్య, పారుల్‌, సరయు, విస్సురెడ్డి, జయలక్ష్మి, అర్క్‌ బాబు, నామాల మూర్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: స్వరాజ్‌, సినిమాటోగ్రఫీ: బుజ్జి.కె, మాటలు: శేఖర్‌ విఖ్యాత్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, ఆర్ట్‌: సత్య, పాటలు: రామ్‌ పైడిశెట్టి, గాంధీ, కో డైరెక్టర్‌: బి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.శ్రీధర్‌, సమర్పణ: ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు, నిర్మాతలు: జి.వి.చౌదరి, నాగరాజు గౌడ్‌ చిర్రా, దర్శకత్వం: లారెన్స్‌ దాసరి.

More News

5న చెబుతా అన్న గుడ్ న్యూస్ 1నే చెప్పేసిన రాజమౌళి..!

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2 లోగో ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈనెల 5న ప్రభాస్ ఫ్యాన్సే కాకుండా సౌతిండియా గర్వంగా ఫీలయ్యే గుడ్ న్యూస్ చెబుతాను అని ప్రకటించారు.

బ్యాంకాక్ లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ విగ్రహం

వచ్చే 2017 సంవత్సరంలో బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియం బాహుబలిని ఆవిష్కరించబోతుంది.

ప్రత్యేక పూజలు పై క్లారిటి ఇచ్చిన చైతు..!

ఇటీవల నాగార్జున సమక్షంలో చైతన్య,సమంత కలిసి పూజ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.

మహేష్ కాస్ట్ లీ ఫైట్.....

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

త్వరలో పరుగెడతా అంటున్నవరుణ్ తేజ్..!

మెగా హీరో వరుణ్ తేజ్ మిష్టర్ సినిమాలో నటిస్తున్నారు.ఊటీలో షూటింగ్ జరుగుతుండగా వరుణ్ తేజ్ కి గాయాలు అయిన విషయం తెలిసిందే.